వైసీపీ ఆవిర్భావ రోజు.... సీఎం జగన్ భావోద్వేగ ట్వీట్ !

Update: 2021-03-12 12:30 GMT
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ .. ప్రజా క్షేత్రంలో పదేళ్లు పూర్తి చేసుకొని పదకొండో వసంతంలోకి అడుగుపెట్టింది. దీనితో నేడు రాష్ట్ర వ్యాప్తంగా  పార్టీ ఆవిర్భావ వేడుకలను వైభవంగా జరుపుతున్నారు  వైసీపీ కార్యకర్తలు. 2011 మార్చి 12న జగన్ నాయకత్వంలో వైసీపీ పార్టీ పుట్టింది. వైఎస్సార్సీపీ అంటే 'యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ'. ఈ సందర్భంగా సీఎం భావోద్వేగ ట్వీట్ చేశారు. మహానేత ఆశయ సాధనే లక్ష్యంగా, విలువలు విశ్వసనీయతల పునాదులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పురుడు పోసుకుంది. ఈ పదేళ్ల ప్రయాణంలో కష్ట సుఖాల్లో నాకు అండగా నిలిచిన ప్రజలకు, నాతో కలిసి నడిచిన నాయకులకు, నా వెన్నంటి ఉన్న కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటూ  ఓ ట్విట్ చేశారు.

కాగా.. కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నేతగా, రెండుసార్లు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అయితే.. అనుకోని విధంగా హెలికాఫ్టర్ ప్రమాదంలో ఆయన దుర్మరణం చెందారు. వైఎస్ మరణం తరువాత పేరు కలిసి వచ్చేలా శివ కుమార్ అనే వ్యక్తి.. 'యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీతో' రిజిస్టర్ చేయించారు. ఆ పార్టీలో చేరిన జగన్, దానికి తానే అధినేత అయ్యారు. తండ్రి పేరు కలిసి వచ్చేలా ఉండటమే అందుకు కారణం. ఆపై 2014లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైనా,, కృంగి పోకుండా ప్రజల కష్టాలు తెలుసుకుంటూ , ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ , ఎవరిని  లెక్కచేయకుండా.. దాదాపు 3 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి, ప్రజలతో మమేకమయ్యారు. ఓ సందర్భంలో జగన్ జైలుకెళ్లడంతో పార్టీ అయోమయంలో పడింది. దీంతో జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిల సహకారంతో పార్టీని నడిపించారు. ఇక భార్య భారతి అన్ని వ్యాపారాలను చూసుకుంటూ వచ్చారు. అలా అన్ని సవాళ్లను ఎదుర్కొంటూ.. ఆపై తన ఆశయాన్ని సాధించుకున్నారు జగన్.
Tags:    

Similar News