ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ప్రభుత్వం ఎటూతేల్చలేకపోతుంది. విస్వసనీయవర్గాల సమాచారం ప్రకారం ..ఈ వైరస్ కారణంగా ఈ బడ్జెట్ సమావేశాలను వాయిదా వేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే వైరస్ కారణంగా ఆర్డినెన్స్ ద్వారా మార్చిలో ప్రభుత్వం బడ్జెట్‌ను తీసుకొచ్చింది. ఇదే మాదిరి మరో మూడు నెలల కాలానికి కూడా ఆర్డినెన్స్ ద్వారానే బడ్జెట్ ను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే , మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే .. అసలు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలా? వద్దా? అనే దానిపై ఈనెల 11న జరిగే కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం ఓ నిర్ణయానికి రాబోతుంది. అయితే, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహణ కష్టమనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే విజయవాడలో వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న నేపథ్యంలో ..ఈ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోని బడ్జెట్ సమావేశలపై ఓ నిర్ణయం తీసుకోబోతున్నారు. అలాగే , డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ లో పూర్తి స్థాయి బడ్జెట్ పై కూడా ఆర్డినన్స్ తేవచ్చు అనే అంశాన్ని ఏపీ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
అయితే, గతంలో బడ్జెట్ సమావేశాలు జూన్ 16 నుండి ప్రారంభం అవుతాయని ఒక వార్త వెల్లడైన విషయం తెలిసిందే. జూన్ 19న రాజ్యసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యలో.. 16 నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జూన్ 16న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇక 18న ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశముంది. బీఏసీ సమావేశం తర్వాత అసెంబ్లీ ఎన్నిరోజులు జరపాలి ...లేదా ఈ బడ్జెట్ సమావేశాలకు రద్దు చేసే దానిపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు.