ఓటుకు నోటు కేసు విషయంలో రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో వాదనలు సాగుతున్నాయి. రేవంత్ బెయిల్ కోసం సుప్రీం కోర్టు న్యాయవాదులు వచ్చి.. వాదనలు వినిపిస్తుండటం విశేషం. కాగా రేవంత్ కుమార్తె నిశ్చితార్థం కోసం ఆయనకు రెండు రోజులు బెయిల్ ఇవ్వాలని.. ఈ రెండు రోజుల్లో సాక్షుల్ని కలవడం, బెదిరించడం జరగదని వారు న్యాయవాదులు పేర్కొన్నారు.
ఐతే ఏసీబీ మాత్రం రెండు రోజుల బెయిల్‌కు అంగీకరించలేదు. ఒక్క రోజు బెయిల్‌కు తమకు అభ్యంతరం లేదని పేర్కొన్నారు. ఈ రోజు సాయంత్రం వెళ్లి రేపు తిరిగి కస్టడీకి తిరిగి రావొచ్చన్నారు. ఐతే ఈ వ్యవధిలో రేవంత్ ఎవరితోనూ సమావేశం కాకూడదని పేర్కొన్నారు. ఏసీబీ ఈ వాదన వినిపిస్తోందంటే.. రేవంత్ వెంట తమ సిబ్బందిని పంపే అవకాశం కూడా ఉన్నట్లే. అంటే రేవంత్ బెయిల్ మీద వచ్చినా పార్టీ నాయకుల్ని కలిసి మాట్లాడేందుకు స్వేచ్ఛ ఉండదన్నమాటే. కాసేపట్లోనే రేవంత్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు నిర్ణయం తీసుకోనుంది. ఒక్క రోజు బెయిల్‌కు మాత్రమే కోర్టు అంగీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.