కెన‌డాలో కాల్పుల షాక్‌..ఉన్మాది సూసైడ్‌

Update: 2018-07-23 07:00 GMT
కెన‌డాలో ఒక ఉన్మాది కార‌ణంగా క‌ల‌క‌లం రేగింది. బ‌ర్త్ డే పార్టీలో కాల్పుల జ‌రిపిన ఉన్మాది అనంత‌రం త‌న‌ను తాను కాల్చుకొని సూసైడ్ చేసుకున్నాడు. కెన‌డాలోని టొరంటోలో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. స్థానికంగా ఉన్న‌గ్రీక్ టౌన్ లోని ఒక రెస్టారెంట్ లో జ‌రిగిన బ‌ర్త్ డే వేడుక‌ల వేళ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి కాల్పులు జ‌రిపాడు. ఉన్మాది దుశ్చ‌ర్య‌తో 9 మంది గాయాల‌పాల‌య్యారు.

కెన‌డా కాల‌మానం ప్ర‌కారం ఆదివారం రాత్రి 10 గంట‌ల వేళ‌లో ఈ దుర్మార్గం చోటు చేసుకుంది. కాల్పులు శ‌బ్దాలు చోటు చేసుకోవ‌టంతో పార్టీలోని వారంతా ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు కాల్పులు చోటు చేసుకున్న ప్రాంతానికి చేరుకొని.. అదుపులోకి తీసుకునే ప్ర‌య‌త్నం చేశారు.

అంత‌లోనే ఉన్మాది త‌న‌ను తాను కాల్చుకొని మ‌ర‌ణించాడు. ఈ ఘ‌ట‌న‌లో మొత్తం 9 మంది గాయ‌ప‌డ‌గా.. వారిలో ఒక చిన్నారి కూడా ఉంద‌ని తెలుస్తోంది. గాయ‌ప‌డిన వారిని చికిత్స‌కోసం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. గాయ‌ప‌డిన వారి ప‌రిస్థితి ఎలా ఉంద‌న్న దానిపై స్ప‌ష్ట‌మైన స‌మాచారం రాలేదు. ఉన్మాదికి సంబంధించిన వివ‌రాలు బ‌య‌ట‌కు రావాల్సి ఉంది.
Tags:    

Similar News