ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 7లక్షలకు చేరింది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి ధాటికి ముఖ్యంగా వృద్ధులు పిట్టల్లా రాలుతున్నారు. అమెరికా, బ్రెజిల్, భారత్, మెక్సికో దేశాల్లో ఎక్కువ సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయని రాయిటర్స్ సంస్థ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.
రాయిటర్స్ నివేదికలో భయం గొలిపే వాస్తవాలు బయటపడ్డాయి. బుధవారం నాటికి మొత్తం కరోనా మరణాల సంఖ్య ఏడు లక్షలకు చేరింది. అంటే 24 గంటల వ్యవధిలో 5900 మంది మరనించినట్లు అంచనా వేసింది. దీని ప్రకారం గంటకు 247మంది చనిపోతున్నారు. అంటే ప్రతి 15 సెకండ్లకు ఒకరు మరణిస్తున్నట్టు నివేదిక తెలిపింది. అమెరికాలో ఇప్పటివరకు అత్యధికంగా 1,55,000మంది కరోనాతో మరణించారు.
కరోనాతో ప్రజారోగ్యం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని.. మహమ్మారి కట్టడిలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని రాయిటర్స్ పేర్కొంది. వైరస్ వ్యాప్తిని అరికట్టిన దేశాల్లోనూ మళ్లీ కేసులు పెరుగుతున్నాయని రాయిటర్స్ తెలిపింది. ముఖ్యంగా లాటిన్ అమెరికా దేశాల్లో పేదరికం, మురికివాడల కారణంగా పెద్ద ఎత్తున వ్యాపిస్తున్నట్టు తెలిపింది.