ఔను.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే మాట వినిపిస్తోంది. కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై నాయకులు రగిలిపోతున్నారు. ఇదేం న్యాయం అంటూ.. నాయకులు ప్రశ్నిస్తున్నారు. కశ్మీర్‌కు ఒక పద్ధతి.. రెండు తెలుగు రాష్ట్రాలకు మరో పద్ధతా? అని నిలదీస్తున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే..
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు ఇప్పట్లో లేనట్లేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్ 26కు అనుగుణంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 170ని సవరించనంత వ రకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో అసెంబ్లీ సీట్ల పెంపు సాధ్యం కాదని కేంద్రం తెలిపింది. రాజ్యసభలో భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్రం స్పష్టం చేసింది.
ఆర్టికల్ 170కి లోబడి ఆంధ్రప్రదేశ్‌లోని అసెంబ్లీ సీట్లను 225కు, తెలంగాణలోని సీట్లను 153కు పెంచాలని విభజన చట్టంలోని సెక్షన్ 26(1) చెబుతోందని కేంద్రం తెలిపింది.
మరి అలాంటపప్పుడు ఎందుకు తాత్సారం చేస్తున్నారనేది రాజకీయ నేతల ప్రశ్న. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 170(3) రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను 2026 తర్వాత జనాభా లెక్కలు ప్రచురించేంతవరకూ పెంచడానికి వీల్లేదని పేర్కొంటోం దని కేంద్రం వాదన.
అందువల్ల విభజన చట్టంలోని సెక్షన్ 26కి అనుగుణంగా రాజ్యాంగ సవరణ చేయకుండా సీట్ల పెంపు సాధ్యం కాదని స్పష్టం చేస్తోంది. 2026 తర్వాత జనాభా లెక్కలు అంటే 2031లో జరుగుతాయి. ఆ లెక్కల ఆధారంగా పునర్విభజన కమిషన్ ఏర్పాటు చేసి నియోజకవర్గాలను పెంచాల్సి ఉంటుంది. అంటే ఎంత వేగంగా చేసినా 2034 లేదా 2039 ఎన్నికల నాటికే తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం ఉండవచ్చు.
కట్ చేస్తే..
అన్ని రాష్ట్రాలకు ఇదే సూత్రం పాటించాలి కదా.. కానీ.. కేంద్రం అలా చేయడం లేదు. తాజాగా ఆర్టికల్ 370 రద్దు తర్వాత.. జమ్ము కశ్మీర్ అసెంబ్లీరద్దు అయింది. దీనికి ఎన్నికలు త్వరలోనే నిర్వహించనున్నా రు. కానీ, ఇక్కడ మాత్రం ఆఘమేఘాలపై నియోజకవర్గాలను పునర్విభజన చేస్తున్నారు. కశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజనకు అవసరం లేని చట్టసవరణ.. తెలుగు రాష్ట్రాలకే అవసరమైందా అని రాజకీయ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఒక్కో రాష్ట్రం విషయంలో ఒక్కోలా నిర్ణయం తీసుకోవడం కేంద్ర ప్రభుత్వానికి సరికాదంటున్నారు.