అమెరికాలో మ‌రో తెలుగు విద్యార్థి దుర్మ‌ర‌ణం

Update: 2019-08-05 07:02 GMT
అమెరికాలో ఇటీవ‌ల తెలుగు విద్యార్థులు వ‌రుస‌గా మృతిచెంద‌డం తెలుగు వారిని తీవ్రంగా క‌లిచి వేస్తోంది. ఎన్నో ఆశ‌ల‌తో ఉన్న‌త విద్య అభ్య‌సించాల‌నుకునే యువ‌తీ, యువ‌కుల‌తో పాటు అక్క‌డ ఉన్న‌త ఉద్యోగం చేసి ఆర్థికంగా స్థిర‌ప‌డ‌డంతో పాటు స‌మాజంలో మంచి స్థానాల్లో ఉండాల‌ని అక్క‌డ అడుగు పెడుతున్నారు. ఈ క్ర‌మంలోనే కొంద‌రు అనుకోని ప్ర‌మాదాల భారీన ప‌డి మృతి చెందుతున్నారు.

అమెరికాలో ఉన్న తెలుగు యువ‌తీ, యువ‌కులు విహార యాత్ర‌ల‌కు వాట‌ర్ ఫాల్స్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి అక్క‌డ అనుకోని ప్ర‌మాదాల‌తో మృతి చెంద‌డ‌మో లేదా రోడ్డు ప్ర‌మాదాల్లో మృతి చెంద‌డ‌మో ఎక్కువుగా జ‌రుగుతోంది. ఇటీవ‌ల కృష్ణా జిల్లాకు చెందిన ఇద్ద‌రు విద్యార్థులు రోడ్డు ప్ర‌మాదంలో దుర్మ‌ర‌ణం పాల‌య్యారు.

ఈ క్ర‌మంలోనే ఉన్న‌త చ‌దువుల కోసం అక్క‌డ‌కు వెళ్లిన మ‌రో యువ‌కుడు రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించార‌న్న వార్త ఆ యువ‌కుడు కుటుంబ స‌భ్యుల‌తో పాటు యావ‌త్ తెలుగు వారిని తీవ్రంగా క‌లిచి వేస్తోంది. నార్త్ కరోలినా లోని షార్లెట్ నగరంలో వివేక్ అనే తెలుగు యువకుడు మృతి చెందాడు. 24 సంవ‌త్స‌రాల వివేక్ ఉన్న‌త చ‌ద‌వులు కోసం అక్క‌డ‌కు వెళ్లాడు.

ఓ వైపు చ‌దువు కుంటూనే ఇక్క‌డ త‌ల్లిదండ్రుల‌కు భారం కాకూడ‌ద‌న్న ఉద్దేశంతో అక్క‌డ పార్ట్ టైమ్ గా ఒక  పెట్రోల్ బంకులో పనిచేసేవాడ‌ని తెలుస్తోంది. పార్ట్ టైమ్ జాబ్ విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండ‌గా ఓ వాహ‌నం వివేక్‌ను ఢీ కొట్ట‌డంతో మృతిచెందాడు. ఇక వివేక్ స్వ‌స్థ‌లం చిత్తూరు జిల్లా మిరియంగంగన పల్లె.

తండ్రి ఒక లాయర్. కుటుంబం బెంగళూరులో స్థిరపడినట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా ఉన్న‌త చ‌దువులు చ‌దువుకుని ఉన్న‌త ఉద్యోగిగా అక్క‌డ స్థిర‌ప‌డ‌తాడ‌నుకున్న త‌మ కుమారుడు ఇక లేడ‌ని తెలియ‌డంతో అత‌డి కుటుంబ స‌భ్యులు క‌న్నీరు మున్నీర‌వుతున్నారు. వివేక్ మృతదేహాన్ని ఇండియాను తరలిస్తున్నారు.

    
    
    

Tags:    

Similar News