ఎన్‌ కౌంటర్‌ మృతుడు ఏ పార్టీ నాయకుడు

Update: 2015-04-13 12:20 GMT
   శేషాచలం ఎన్‌కౌంటర్‌ మృతుల్లో తమళనాడులో ఓ ప్రధాన పార్టీకి చెందిన జిల్లా నేత ఒకరు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తమిళనాడులో ఒక జిల్లా స్థాయి నేత ఈ స్మగ్లింగ్‌ లో కీలకమని... ఆయన ఈ ఎన్‌ కౌంటర్‌ లో తూటాలకు నేలకొరిగారని సమాచారం. మృతుల నేర చరిత్రను సేకరించేందుకు తమిళనాడు వెళ్లిన ఏపీ పోలీసుల విచారణలో ఈ విషయం గుర్తించారు.  అయితే... ఆయన ఏ పార్టీకి

చెందినవారనేది తెలుసుకున్నప్పటికీ ఇంకా బయటకు వెల్లడిరచలేదు.
    ఎర్రకూలీల ఎన్‌కౌంటర్‌ కు నిరసనగా తమిళనాడులో ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ స్మగ్లింగులో రాజకీయ నేతలు పెద్ద సంఖ్యలో ఉండడం వల్లే ఆందోళనలు చేయిస్తున్నారని ఏపీ పోలీసులు అంటున్నారు. ఆంధ్రబ్యాంకులు, తెలుగువాళ్ల హోటళ్లు, ఆస్తులపై ఎవరు దాడులు చేయిస్తున్నారో గుర్తించేపనిలో పడ్డారు. అది తెలిస్తే స్మగ్లర్ల గుట్టు రట్టు చేయొచ్చని

భావిస్తున్నారు.
    మృతుల నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ ఫోన్ల ఆధారంగా ఎర్రచందనం కూలీలు ఎవరెవరితో మాట్లాడారన్న కాల్‌ డేటాను పోలీసులు సేకరించారు. ఈఎన్‌కౌంటర్‌ జరగడానికి కొన్ని గంటల ముందు కూలీలు ఎర్రచందనం స్మగర్లతో టచ్‌లోనే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పాటు శేషాచలం ఎన్‌ కౌంటర్‌ తర్వాత తమిళనాడులోని ఆంధ్ర హోటల్స్‌, సంస్ధలపై జరగుతున్న దాడుల

వెనుక ఎవరున్నారనే దానిపై కూడా ఏపీ పోలీసులు దృష్టి పెట్టారు. ఇందుకోసం ఓ పోలీసు బృందం తమిళనాడుకు వెళ్లింది. ఈ దాడులకు ఎవరు ప్రోత్సహిస్తున్నారనే విషయాన్ని తెలుసుకుంటే ఎర్రచందనం స్మగ్లర్ల నెట్‌ వర్క్‌ను ఛేదించవచ్చని పోలీసు అధికారులు భావిస్తున్నారు.  మరోవైపు స్మగ్లర్ల వివరాలు సేకరించేందుకు గాను సీఐడీ అధికారులు కూడా రంగంలోకి దిగారు.
Tags:    

Similar News