కలకలం: అమెరికా నైట్ క్లబ్ లో కాల్పులు

Update: 2017-03-26 09:37 GMT
ఒకప్పుడు భద్రతకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన అగ్రరాజ్యాలు.. ఉగ్ర పంజాతో విలవిలలాడిపోతున్నాయి.వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా.. ఉగ్రభూతం ఏదో ఒక రూపంలో అగ్రరాజ్యాల మీద విరుచుకుపడుతోంది. మొన్నటికి మొన్న లండన్ పార్లమెంటుకు కూతవేటు దూరంలో ఉగ్రవాద మనస్తత్వంతో సృష్టించిన ఆరాచకం ఏపాటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఈ ఉదంతానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాకముందే.. ఈసారి అమెరికాలో చోటు చేసుకున్న కాల్పులు కొత్త కలకలానికి తెర తీస్తున్నాయి.

ఒహియోలోని సిన్సినాటి నైట్ క్లబ్ లో ఆదివారం తెల్లవారుజామున ఒక సాయుధుడు చొరబడ్డాడు. విచక్షణారహితంగా కాల్పులకు తెగ బడ్డాడు. ఈ కాల్పుల్లో ఒక వ్యక్తి మృతి చెందగా.. పద్నాలుగు మంది గాయపడినట్లుగా చెబుతోంది. కొన్ని మీడియా సంస్థలు పేర్కొంటున్న కథనాల ప్రకారం..   కాల్పుల్లో పెద్ద ఎత్తున క్షతగాత్రులు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఆ మధ్యన ఫ్లోరిడాలోని ఓర్లాండో నైట్ క్లబ్ లో జరిగిన కాల్పుల ఘటనలో49 మంది ప్రాణాలు కోల్పోవటం తెలిసిందే. తాజా ఉదంతానికి సంబంధించిన మరిన్ని వివరాలు బయటకురావాల్సి ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News