మోహ‌న్ బాబుకు బ్యాడ్ న్యూస్‌... ఏడాది జైలు

Update: 2019-04-02 09:16 GMT
రాజ‌కీయాల్లో చేరి వారం రోజులు కాక‌ముందే మంచు మోహ‌న్‌ బాబుకు పెద్ద బ్యాడ్ న్యూస్ వినాల్సి వ‌చ్చింది. ఓ చెక్ బౌన్స్ కేసులో అత‌నికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఎర్ర‌మంజిల్ కోర్టు తీర్పు చెప్పింది. కొన్ని నిమిషాల్లోనే ఈ వార్త వైర‌ల్ అయ్యింది. ఇటీవ‌లే రాజ‌కీయాల్లో రెండో ఇన్సింగ్స్ మొద‌లుపెట్టిన మోహ‌న్ బాబుకు ఇది చేదు వార్తే.

కేసు పూర్వాప‌రాలు చూస్తే ఎన్టీఆర్ వీరాభిమాని అయిన వైవీఎస్ చౌద‌రి వేసిన కేసులో ఆయ‌నకు ఈ శిక్ష ప‌డ‌టం యాదృశ్చికం. ఎందుకంటే స‌లీం సినిమా సంద‌ర్భంగా జ‌రిగిన లావాదేవీల‌కు సంబంధించిన గొడ‌వ ఇది. మోహ‌న్ బాబు ల‌క్ష్మీ ప్ర‌స‌న్న పిక్చ‌ర్స్ త‌ర‌ఫున సుమారు 40 ల‌క్ష‌ల చెక్కును వైవీఎస్ చౌద‌రికి ఇచ్చారు. సంబంధిత అక్కౌంట్ లో డ‌బ్బు లేక‌పోవ‌డంతో అది బౌన్స్ అయ్యింది. ఉద్దేశ‌పూర్వ‌కంగా త‌న‌ను మోసం చేశారంటూ 2010లో వైవీఎస్ చౌద‌రి కోర్టు కు వెళ్లారు. దానిపై సుదీర్ఘ విచార‌ణ అనంత‌రం ఈరోజు ఎర్ర‌మంజిల్ కోర్టు తీర్పు ఇచ్చింది.

మోహ‌న్ బాబు త‌ప్పు చేసిన‌ట్టు తేల‌డంతో ఆయ‌న‌కు ఏడాది జైలు శిక్ష‌ - ప‌ది వేల జ‌రిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. ఒక వేళ జ‌రిమానా క‌ట్ట‌లేని ప‌క్షంలో ఇంకో మూడు నెల‌ల జైలు శిక్ష అనుభ‌వించాల్సి ఉంటుంది. అలాగే చౌద‌రికి ఇవ్వాల్సిన రూ.41,75,000  కూడా చెల్లించాల‌ని తీర్పు ఇచ్చింది.

దీనిపై మోహ‌న్ బాబు బెయిలుకు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. 1.53 గంట‌ల‌కు అతను ఒక ఫాల్స్ న్యూస్ మీడియాలో వ‌స్తుంది - నేను ఇంట్లోనే ఉన్నాను అని ట్వీట్ పెట్టారు. కానీ జైలు శిక్ష విష‌యాన్ని ఖండించ‌లేదు. బెయిలు మంజూర‌యిన‌ట్లు చెబుతున్నారు అయితే ఇంకా అధికారికంగా అది వెల్ల‌డికాలేదు.
Tags:    

Similar News