చాలా కొద్ది మందికి తప్పించి సామాన్యులకు ఏ మాత్రం పరిచయం లేని ‘లాక్ డౌన్’ ఒక్కసారిగా జన జీవితాల్లోకి వచ్చేసింది. కరోనా మహమ్మారికి చెక్ చెప్పటానికి లాక్ డౌన్ కు మించిన మార్గం మరొకటి లేదంటూ కేంద్రం నిర్ణయం తీసుకోవటానికి ఒక రోజు ముందే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణలో లాక్ డౌన్ ను విధించారు. కాకుంటే.. వేరే పేరు మీద. అలా తెలుగు ప్రజలకు పరిచయమైన లాక్ డౌన్ కు రేపటికి ఏడాది. వూహాన్ లో మొదలైన కరోనా కలకలం చైనాను దాటేసి.. ఖండాలు దాటి భారత్ కు కాస్త ఆలస్యంగానే వచ్చింది.
మిగిలిన దేశాల నిర్లక్ష్యం ఎంతటి మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చిందన్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వాలు.. లాక్ డౌన్ విధించటంతో వ్యవస్థలు స్తంభించిపోవటమే కాదు.. జనజీవిత ప్రయాణం సడన్ బ్రేక్ కు గురైంది. ఉరుకుల పరుగుల జీవితంలో ఇంట్లో ఉండటమే గగనమైపోయిన పరిస్థితి నుంచి ఇంట్లో మాత్రమే ఉండాల్సిన పరిస్థితి. దీంతో.. కొత్త తరహా జీవితమే కాదు.. కుటుంబ అనుబంధాల్లోనూ కొత్తదనం పరిచయమైంది.
నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు బయట తిండికి అలవాటైన ప్రజలు.. అందుకు భిన్నంగా ఇంట్లోనే వండుకోవాల్సి రావటం.. మగమహారాజులు సైతం గరిటె పట్టేసుకోవటం లాక్ డౌన్ తోనే సాధ్యమైంది. లాక్ డౌన్ నిర్ణయంతో వైరస్ వ్యాప్తి భారీగా తగ్గటమే కాదు.. అపార ప్రాణనష్టం తప్పించింది. కాకుంటే.. ఊహకు అందని రీతిలో ప్రకటించిన లాక్ డౌన్ కారణంగా ఎక్కడివారు అక్కడే నిలిచిపోవటంతో.. చుట్టాలు.. స్నేహితుల ఇళ్లల్లో ఉండటం ఎంత కష్టమన్న విషయం అర్థమైంది. ఒకచోటు నుంచి మరో చోటుకు వెళ్లటం ఇంత కష్టమా? అన్నది అందరికి అనుభవంలోకి వచ్చింది. మొత్తంగా లాక్ డౌన్ మరిచిపోలేని అనేక అనుభూతుల్ని మిగిల్చింది.
సామాజిక అంశాల్ని పక్కన పెడితే.. ఆర్థిక అంశాల విషయంలో అప్పటివరకు ఎదురుకాని ఎన్నో సమస్యల్ని.. సవాళ్లను ఎదుర్కొనేలా చేసింది. చాలామంది ఉద్యోగాలు పోతే.. ఉద్యోగాలు ఉన్న వారికి జీతాల్లో కోత పెట్టి ఇచ్చిన వైనంతో ఇంటి బడ్జెట్ లలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంటి పట్టునే ఉండిపోవటంతో ఖర్చు తగ్గినప్పటికీ.. అదే సమయంలో ఆదాయం తగ్గటంతో వేతన జీవులు ఇబ్బందులకు గురయ్యారు. వ్యాపారుల విషయానికి వస్తే.. అత్యవసర.. నిత్యవసర వస్తువులు అమ్మే వారు తప్పించి మిగిలిన వారంతా వ్యాపారాల్ని బంద్ చేసుకోవాల్సి రావటంతో దారుణంగా దెబ్బ తిన్నారు. ఇక.. బడుగు జీవుల కష్టాలు అన్ని ఇన్ని కావు. లాక్ డౌన్ చాలామందికి జీవితంలో మర్చిపోలేని ఎన్నో పాఠాల్ని నేర్పింది.
లాక్ డౌన్ కు ముందు దేశంలో కరోనా వైరస్ పునరుత్పత్తి 1.7గా ఉంటే.. అదికాస్తా 1.2కు తగ్గింది. కేసుల సంఖ్య ప్రతి నాలుగు రోజులకు రెట్టింపు అయితే.. లాక్ డౌన్ కారణంగా 30 రోజులకు ఒకసారి రెట్టింపుఅయ్యే పరిస్థితి. ఇలా వైరస్ వ్యాప్తిని లాక్ డౌన్ అడ్డుకుందని చెప్పాలి. మార్చిలో మొదలైన కేసుల పరంపర.. రెండు తెలుగు రాష్ట్రాల్లో అంతకంతకూ పెరిగి.. ఆగస్టు నాటికి పీక్స్ కు చేరితే.. అక్టోబరు.. నవంబరు నాటికి తగ్గుముఖం పట్టాయి.
మరోవైపు కేరళ..మహారాష్ట్రలలో కేసుల నమోదు అంతకంతకూ పెరుగుతున్న వేళ.. ఇప్పుడిప్పుడే మళ్లీ కేసుల సంఖ్య రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెరుగుతోంది. ఇటీవల కాలంలో తెరిచిన విద్యా సంస్థలు.. హాస్టళ్లు.. గురుకులాలు కొత్త కేసుల నమోదుకు కేరాఫ్ అడ్రస్ గా మారాయి. ఈ నేపథ్యంలో మరోసారి.. స్కూళ్లు.. హాస్టళ్ల మూసివేత మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.