ఒంగోలులో ఎగబడ్డారు..కరోనా నియంత్రణ మరిచారు

Update: 2020-03-30 07:34 GMT
కరోనా.. భయంకరమైన అంటువ్యాధి.. ప్రపంచాన్ని కబళిస్తోంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి దేశాలకు దేశాలనే వణికిస్తోంది. ఇటలీ - అమెరికా - ఇరాన్ - యూరప్ దేశాల్లో మరణ మృదంగం వాయిస్తోంది. స్వీయ నియంత్రణ తప్ప.. మందులేని ఈ అంటువ్యాధిని నియంత్రించేందుకు కేంద్రం లాక్ డౌన్ విధించి జనాలను బయటకు రాకుండా ఇంట్లోనే కట్టడి చేసింది.

అయితే కూరగాయాలు - నిత్యవసరాల కోసం ఉదయం పూట కాస్త రిలాక్సేషన్ ఇస్తోంది. అయితే దాన్ని ప్రజలు దుర్వినియోగం చేస్తూ కరోనాను అంటించుకుంటున్నారు.

తాజాగా కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు గుంపులుగా గుమికూడదని.. సోషల్ డిస్టేన్స్ పాటించడం ద్వారానే వైరస్ ను అరికట్టవచ్చని నిబంధనలు పాటించారు.  నిత్యావసరాల కోసం బయటకు వచ్చే వారు కూడా తప్పనిసరిగా దూరంగా ఉండి జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

అయితే ఏపీలో జనాలకు మాత్రం ఈ కరోనా భయం కొంచెం కూడా లేకపోవడం విస్తుగొలుపుతోంది. అసలేం మాత్రం జాగ్రత్తలు తీసుకోకుండా ఎగబడుతున్న జనాలను చూసి అధికారులు షాక్ అవుతున్నారు.

ఆదివారం ఒంగోలులో చికెన్ దుకాణాలు - ఆ పరిసర మార్కెట్ కు జనం పోటెత్తారు. కనీస జాగ్రత్తలు పాటించకుండా ఎగబడ్డారు. రాసుకు పూసుకు తిరిగారు. గుంపులుగా సంచరించారు. ఆ ఆఫొటోలు మీడియాలో వైరల్ అయ్యాయి. ఇలా తిరిగితే కరోనా రాక చస్తుందా అని నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రభుత్వం ఎన్ని నిబంధనలు తెచ్చినా.. సూచించినా పట్టని జనాల తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. కఠిన చర్యల దిశగా ప్రభుత్వాన్ని పురిగొల్పుతోంది. ఇప్పటికైనా జనాలు దూరం పాటిస్తూ కరోనాను అరికట్టకపోతే పెద్ద ఉపద్రవమే ఏపీలో చోటుచేసుకుంటుంది.


Tags:    

Similar News