ఆన్ లైన్ లో శిక్ష రద్దు చేయాలంటూ ఉద్యమం .. ఉరిశిక్ష ఆపేశారు !

Update: 2021-11-09 11:30 GMT
ఉరిశిక్ష పడిన వ్యక్తి కోసం మానవ హక్కుల సంఘాలు నడుంబిగించి, క్షమాభిక్ష పెట్టాలంటూ ఉద్యమించి చివరికి అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో ఉరిశిక్ష పడిన ఓ భారత సంతతి వ్యక్తి కోసం సింగపూర్లో ఆన్‌లైన్ వేదికగా భారీ ఉద్యమం చేపట్టిన కారణంగా ఉరిశిక్షను ఆపేశారు. ఆన్ లైన్ లో శిక్షను రద్దు చేయాలంటూ వినతులు వెల్లువెత్తాయి. డ్రగ్ ట్రాఫికింగ్ చేస్తున్న కేసులో ఆరోపణలు ఎదుర్కొని నేరం రుజువు కావడంతో శిక్ష విధించారు. మానసికంగా దివ్యాంగుడైనటువంటి నాగేంద్రన్ కే ధర్మలింగంను ఉరితీయాలంటూ తీర్పు వచ్చింది.

బుధవారం ఛంగీ జైలులో ఉరితీసేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ లోగా ఆన్‌ లైన్‌ లో వచ్చిన వినతులపై సింగపూర్ హైకోర్ట్ స్పందించింది. ఆన్‌ లైన్ హియరింగ్ తో శిక్షను ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. నాగేంద్రన్ లాయర్ ఎం రవి ఫేస్ బుక్ లో పోస్టు చేసి ఉరిశిక్ష వాయిదా పడినట్లుగా హైకోర్టు తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. దీనిపై మంగళవారం వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా విచారణ జరగనుంది. 2009లో 21ఏళ్ల వయస్సున్న నాగేంద్రన్ వుడ్ ల్యాండ్స్ చెక్ పాయింట్ వద్ద డ్రగ్స్ ట్రాఫికింగ్ చేస్తూ దొరికిపోయాడు. సింగపూర్, పెనిన్సులర్ మలేసియల మధ్య సరఫరా చేస్తున్నట్లుగా తెలిసింది.

నవంబర్ 2010లో 42.72గ్రాములు హెరాయిన్ తరలించినందుకు మరణశిక్ష విధించింది కోర్టు. డ్రగ్స్ యాక్ట్ ప్రకారం 15గ్రాముల కంటే హెరాయిన్ ఎగుమతి చేయడం నేరం. అలా శిక్షను ఎదుర్కొంటున్న నాగేంద్రన్ ను కాపాడాలంటూ అతని తల్లి సోషల్ మీడియా వేదికగా సపోర్ట్ కోసం లెటర్ పోస్టు చేసింది. దానిపై భారీ ఎత్తులో పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ప్రస్తుతానికి ఉరిని వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు.

మలేషియాకు చెందిన నాగేంద్రన్ కె ధర్మలింగం అనే భారత సంతతి వ్యక్తి 2009లో సింగపూర్‌ లో డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డాడు. ఆ సమయంలో అతని వద్ద 42.72 గ్రాముల హెరాయిన్‌ దొరికినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అభియోగం పై 2010లో సింగపూర్ కోర్టు దోషిగా తేలింది. దీంతో నాగేంద్రన్‌ కు ఉరిశిక్ష విధించింది. ఈ క్రమంలో నవంబరు 10న నాగేంద్రన్‌ కు మరణశిక్షను అమలు చేయనున్నట్లు అక్కడి మీడియాలో వార్తలు వెలువడ్డాయి. దీంతో ఆందోళన చెందిన మానవ హక్కుల సంఘాలు నాగేంద్రన్‌ కు క్షమాభిక్ష పెట్టాలంటూ సింగపూర్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చాయి.



Tags:    

Similar News