టీడీపీ విమ‌ర్శుల మీడియాలో మాత్ర‌మేనా...!

Update: 2021-10-28 13:30 GMT
రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను, ప‌రిస్థితుల‌ను టీడీపీ అందిపుచ్చుకోలేక పోతోందా ?  ప్ర‌జ‌ల‌కు బాస‌ట‌గా నిల‌వ‌లేక పోతోందా ?  అనే చ‌ర్చ సాగుతోంది. ఎందుకంటే.. టీడీపీ వ‌చ్చే ఎన్నిక‌ల‌పై ఎన్నో ఆశ‌లు పెట్టుకుంది. అధికారంలోకి రావ‌డ‌మే ప‌ర‌మావ‌ధి అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. జ‌గ‌న్ పాల‌నపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తోంది. జ‌గ‌న్‌కు పాల‌న చేత‌కావ‌డం లేద‌ని.. అప్పుల మ‌యం చేస్తున్నార‌ని కూడా విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది. నిజ‌మే.. కావొచ్చు. అయితే.. టీడీపీ చేస్తున్న ఈ విమ‌ర్శ‌లు కేవ‌లం మీడియాకు మాత్ర‌మే ప‌రిమితం అవుతున్నాయి.

అయితే.. మీడియాను ఎంత మంది వీక్షిస్తున్నారు. పేప‌ర్ల‌ను ఎంత మంది చ‌దువుతున్నారు. అనేది చూస్తే.. రాష్ట్రంలో 45 శాతం మంది మాత్ర‌మే.. మీడియాను చూస్తున్నారు. సో.. టీడీపీ చేస్తున్న ఈ విమ‌ర్శ‌లు.. వివాదాలు, కామెంట్లు వంటివి కేవ‌లం పాతిక శాతం మందికే చేరుతున్నాయి. ఎందుకంటే.. మిగిలిన వారిలో 20 శాతం మంది వైసీపీకి మ‌ద్ద‌తిచ్చేవారే కాబ‌ట్టి. ఇక‌, మిగిలిన వారి ప‌రిస్థితి ఏంటి ?  వారికి టీడీపీ ఎలా చేరుతుంది? అనేది ప్రశ్న‌. పైగా క్షేత్ర‌స్థాయిలో పార్టీ పుంజుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప‌దే ప‌దే చంద్ర‌బాబు అంటున్నారు. కానీ, దీనికి త‌గిన విధంగా కార్యాచ‌ర‌ణ మాత్రం చేయ‌లేక పోతున్నారు. బాబు ఇప్ప‌ట‌కీ కాలం చెల్లిన రాజ‌కీయాలే చేస్తుండ‌డంతో పార్టీ చాలా మందికి దూరం అవుతోంది.

ప్ర‌స్తుతం రాష్ట్రంలో టీడీపీ నేత‌ల‌ను క‌దిలిస్తే.. గంజాయి.. రాష్ట్ర పార్టీ కార్యాల‌యంపై జ‌రిగిన దాడిని మాత్ర‌మే ప్ర‌స్తావిస్తున్నారు. కానీ, వీటిని ప్ర‌జ‌లు పెద్దగా ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న‌ది నిజం. ఎందుకంటే.. గంజాయి స‌మ‌స్య ఇప్ప‌టిది కాదు. ఎప్ప‌టి నుంచో ఉన్న‌దే. ఇక‌, పార్టీ కార్యాల‌యంపై దాడిని మీరు అలా.. తిట్ట‌క‌పోతే.. జ‌రిగేది కాదుగా! అనే పెద‌వి విరుపులు క‌నిపిస్తున్నాయి. సో.. పార్టీ ఆశించిన మైలేజీ ల‌భించ‌డంలేదు. కానీ.. మ‌రోవైపు. ప్ర‌జ‌లు రోడ్డెక్కుతున్నారు. జ‌గ‌న్‌పై ప్ర‌జ‌లే విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. అమ్మ ఒడి ఎవ‌రు ఇవ్వ‌మ‌న్నారు ? అని ప్ర‌శ్నిస్తున్నారు.

ఎయిడెడ్ పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల‌ను ప్ర‌భుత్వం తీసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తుండ‌డంపై ప్ర‌జ‌ల్లో తీవ్ర ఆవేద‌న ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. అదే స‌మ‌యంలో విద్యుత్ చార్జీల పెంపు.. వంటివి కూడా ప్ర‌జ‌లు తీవ్రంగా భావిస్తున్నారు. నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు.. పె ట్రో ధ‌ర‌లు.. కూర‌గాయ‌ల‌ల ధ‌ర‌లు ఇలా అనేక స‌మ‌స్య‌ల‌పై ప్ర‌జ‌లే స్వచ్ఛందంగా రోడ్డెక్కుతున్నారు. మ‌రి ఈ స‌మ‌యంంలో ప్ర‌జ‌ల‌కు చేరువై.. వారికి మ‌ద్ద‌తుగా.. టీడీపీ వాయిస్ వినిపించాల్సిన అవ‌స‌రం ఉంది.

కానీ, ఆదిశ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబుకానీ.. పార్టీ నేత‌లు కానీ దృష్టి పెట్ట‌లేదు. బాబు ప్ర‌జ‌ల కోణంలో పోరాటం చేయ‌క‌పోతే ప్ర‌జ‌ల‌కు కూడా టీడీపీ అక్క‌ర్లేద‌న్న భావ‌న‌లోనే ఉన్నారు. మ‌రోవైపు.. రేష‌న్ డీల‌ర్లు స‌మ్మెకు దిగుతున్నారు. మ‌రి ఇలాంటి వాటిని వాడుకోవాల్సిన పార్టీ.. కేవ‌లం పార్టీ కార్యాల‌యంపై దాడిని హైలెట్ చేస్తే ప్ర‌యోజ‌నం ఉంటుందా ? అంటున్నారు.
Tags:    

Similar News