అమెరికా ఎంట్రీకి ఈ 7 టీకాల్లో ఏదో ఒకటి మాత్రమే వేసుకొని ఉండాలి

Update: 2021-09-22 03:51 GMT
కరోనా కారణంగా.. విదేశీ ప్రయాణాల విషయంలో ఆయా దేశాలు బోలెడన్ని ఆంక్షల్ని విధిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే కొన్ని దేశాలు తమ ఆంక్షల్ని సడలిస్తున్నాయి. టీకాలు వేసుకున్న వారిని ఆయా దేశాలు ఓకే చేస్తున్నా.. అగ్రరాజ్యం అమెరికా మాత్రం ఇప్పటివరకు విద్యార్థులకు మాత్రమే అవకాశం ఇచ్చింది ఇదిలా ఉంటే.. తాజాగా అమెరికాకు రావాలనుకునే ప్రయాణికులకు తీపి కబురు చెప్పింది.

నవంబరు నుంచి తమ దేశానికి ప్రయాణికుల్ని అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. కాకుంటే.. కరోనా టీకా పూర్తిస్థాయిలో తీసుకున్న వారికే ఆ అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. అయితే.. తమ దేశంలో ప్రయాణించే వారికి అనుమతించే విషయంలో ఏడు వ్యాక్సిన్లు మాత్రమే అగ్రరాజ్యం ఓకే చెప్పింది. ఇందులో భారత్ లో లభించే మూడు టీకాల్లో ఒకదానికి మాత్రమే అనుమతి లభించింది. తమ దేశానికి వచ్చే వారికి ఏ టీకా ఆమోదయోగ్యమని వ్యాధుల నియంత్రణ కేంద్రం ఓకే చెబుతుందో.. దానికి మాత్రమే తాము ఓకే చేస్తామని చెప్పింది.

ఇప్పటివరకు అమెరికా ఏడు టీకాల్ని మాత్రమే గుర్తించింది. ఇందులో మన దేశానికి చెందిన కొవిషిల్డ్ మాత్రమే ఉంది. మిగిలిన ఆరు టీకాల్ని చూస్తే..

1. మోడెర్నా
2. ఫైజర్
3. జాన్సన్ అండ్ జాన్సన్
4. ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రాజెనెకా
5. సినో ఫార్మ్
6. సినోవాక్

మరి.. మన దేశంలో డెవలప్ చేసిన కొవాగ్జిన్ టీకా విషయానికి వస్తే.. ఇప్పటివరకు అనుమతులు లభించలేదు. అయితే.. ఈ నెలాఖరు లోపు కొవాగ్జిన్ కు అమెరికా ఓకే చెబుతుందని చెబుతున్నారు. డబ్ల్యూహెచ్ వో అనుమతి కోసం గడిచిన కొద్ది నెలలుగా భారత్ బయోటెక్ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోంది. అందుకు అవసరమైన పత్రాల్ని సమర్పిస్తోంది. ఇప్పటివరకు అందించిన పత్రాలపై సానుకూలత వ్యక్తమవుతోందని.. ఈ నెలాఖరులో ఖాయంగా కొవాగ్జిన్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓకే చెబుతుందని.. .ఆ వెంటనే అమెరికా కూడా అంగీకారం తెలుపుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News