మోడీకి ఓటేయడానికి విదేశీ ఉద్యోగానికి రాజీనామా!

Update: 2019-04-14 10:27 GMT
ప్రధానమంత్రి నరేంద్రమోదీ విదేశీయుల్లో భారతీయులను కూడా తన ప్రసంగాలతో ఆకర్షిస్తున్నారు. మరోసారి మోదీ రావాలనే నినాదంతో విదేశాల నుంచి ఓటు వేసేందుకు తరలివస్తున్నారు. ఓటు వేసేందుకు సెలవు ఇవ్వకపోవడంతో ఉద్యోగాలు మానేసి వచ్చే వారు కూడా ఉన్నారంటే ఆశ్చర్యం కాదు.

కర్ణాటకలోని మంగళూరుకి చెందిన సుదీంద్ర (41) సిడ్నీ ఎయిర్‌ పోర్టులో స్క్రీనింగ్‌ అధికారిగా పని చేస్తున్నారు. ఈక్రమంలో భారత సార్వత్రిక ఎన్నికల కోసం సెలవు కోరారు. అయితే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎయిర్‌పోర్టు అధికారులు సెలవు మంజూరు చేయలేదు. ఈ క్రమంలో సుదీంద్ర తన ఉద్యోగానికి రాజీనామా చేసి సొంతూరుకు తిరిగి వచ్చారు. తాను బీజేపీకి ఓటు వేయాలని.. మోదీ పాలన నచ్చిందని.. మరోసారి ప్రధాని కావాలని ఆకాంక్షించారు.

ఆయన ఏడాదిన్నర కాలంగా భారత్‌లోనే ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. ఈ క్రమంలో ఈనెల 5 నుంచి 12వ తేదీ సెలవు పొడిగించాలని కోరగా.. అధికారులు నిరాకరించారు. ఫలితంగా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. అయితే పోలింగ్‌ అనంతరం తాను సిడ్నీ తిరిగి వెళ్తానని.. అక్కడే వేరే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటానని చెప్పారు. గత 2014 ఎన్నికల్లో కూడా ఆయన సిడ్నీ నుంచి వచ్చి ఓటు వేసి వెళ్లారు. అనంతరం విధులకు హాజరయ్యారు. 


Tags:    

Similar News