ఎర్ర‌బుగ్గ తీసేందుకు ర‌చ్చ చేస్తున్న ఇమాం

Update: 2017-05-10 05:16 GMT
వీవీఐపీ వ్య‌వ‌స్థ‌కు చ‌ర‌మ‌గీతం పాడాలంటూ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అనేక నిర్ణ‌యాలు తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా వీవీఐపీ వ్య‌వ‌స్థ‌కు చిహ్న‌మైన ఎర్ర‌బుగ్గ‌ను తొల‌గించాలంటూ ప్ర‌ధాని నిర్ణ‌యం తీసుకోవ‌టం తెలిసిందే. ఈ నిర్ణ‌యంపై దేశ వ్యాప్తంగా ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతుంటే.. ఒక ఇమాం మాత్రం అందుకు భిన్నంగా మంట పుట్టే మాట‌లు చెబుతుండ‌టం గ‌మ‌నార్హం. మౌలానా నురూర్ రెహ్మాన్ ఇమాం బ‌ర్క‌తి మాత్రం అందుకు భిన్నంగా స్పందించారు.

తాను వాడే ఎర్ర‌బుగ్గ‌ను తీసే ప్ర‌స‌క్తే లేద‌ని తేల్చి చెప్ప‌టం గ‌మ‌నార్హం. ఎర్ర‌బుగ్గ‌ను వాడేందుకు త‌మ‌కు అప్ప‌టి బ్రిటిష్ ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చిందంటూ పిడివాద‌న‌ను తెర మీద‌కు తెచ్చారు. ఎర్ర‌బుగ్గ‌ను తీసేసే ప్ర‌స‌క్తే లేద‌న్న ఆయ‌న‌.. బ్రిటీష్ ప్ర‌భుత్వాన్ని తెర మీద‌కు తీసుకురావ‌టంపై ప‌లువురు మండిప‌డుతున్నారు.

బ్రిటీష్ ప్ర‌భుత్వం ముచ్చ‌ట త‌ర్వాత‌.. ఇండియ‌న్ గ‌వ‌ర్న‌మెంటు తాజాగా ఆదేశాలు జారీ చేసింది క‌దా? అన్న ప్ర‌శ్న‌కు అడ్డ‌గోలు వాద‌న‌ను వినిపిస్తూ.. భార‌త ప్ర‌భుత్వం మొద‌ట త‌న సొంత చ‌ట్టాల్ని అమ‌లు చేయాల్సి ఉంద‌ని.. ఏ చట్టాన్నీ భారత ప్ర‌భుత్వం రూపొందించ‌లేద‌ని.. అలాంట‌ప్పుడు ఎర్ర‌బుగ్గ‌ను తాను ఎలా తొల‌గిస్తాన‌ని వ్యాఖ్యానిస్తున్నాడు. బ‌ర్క‌తి వ్యాఖ్య‌ల‌పై బీజేపీ నేత‌లు సీరియ‌స్ అవుతున్నారు. నిజానికి బ‌ర్క‌తీ ఇలాంటి త‌ల‌తిక్క వ్యాఖ్య‌లు చేయ‌టం ఇదే మొద‌టిసారి కాద‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు. చ‌ట్టాన్ని ధిక్క‌రించే అధికారం ఎవ‌రికీ లేద‌ని.. ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్న బ‌ర్క‌తీని అరెస్ట్ చేసి జైల్లో వేయాలంటూ బీజేపీ నేత సీకే బోస్ డిమాండ్ చేస్తున్నారు. నిజ‌మే.. ఇలాంటి త‌ల‌తిక్క వాద‌న‌లు తెర మీద‌కు తెచ్చే వారిపై చ‌ట్టం కాస్త తీవ్రంగానే రియాక్ట్ కావాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.


Tags:    

Similar News