ఫేస్ బుక్ లో పొలిటికల్ వార్

Update: 2016-04-26 07:41 GMT
కేరళ లోని ఎన్నికల సమరం సరికొత్త రూపు సంతరించుకుంటోంది.  అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న యువకులు - సీనియర్ నేతలు మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లకు ఫేస్ బుక్ వేదికగా మారింది. పార్టీలకు - అభ్యర్ధుల వయసులకు అతీతంగా సోషల్ మీడియాలో ఎన్నికల ప్రచారం హోరెత్తిపోతోంది.  తొంబైరెండేళ్ల మార్క్సిస్టు నాయకుడు వీఎన్  అచ్యుతానందన్ మొదలు అత్యంత పిన్నవయస్కుడైన ఎమ్యెల్యే కేఎస్ శబరినాధన్ వరకు .. ఫేస్ బుక్  - ట్విట్టర్ వంటి సోషల్ మీడియా వెబ్ సైట్లలో చురుగ్గా స్పందిస్తున్నారు. ప్రత్యర్ధులపై విమర్శల దాడికి  దిగుతూ ఓటర్లకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.  ముఖ్యంగా మాజీ సీఎం అచ్యుతానంద్ - ప్రస్తుత సీఎం ఊమెన్ చాందీ మధ్య ఫేస్ బుక్ వార్ రసవత్తరంగా ఉంది.  అచ్యుతానందన్ ఫేస్ బుక్ ఖాతా తెరిచి పట్టుమని పదిరోజులు కాకముందే సంచలన పోస్టులతో హల్ చల్ చేస్తున్నారు. శనివారం ఓ మీడియా ప్రతినిధి తన వ్యాఖ్యాలను వక్రీకరించారంటూ అంతెత్తున ఎగిరి పడుతూ పోస్టు పెట్టారు.  తరువాత ఫేస్ బుక్ ద్యారా తన చేసిన వ్యాఖ్యాలను ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మెల్లమెల్లగా అడుగులు వేస్తున్న ఈ  పెద్దయన పేజీకి అప్పుడే లక్షాముప్పై వేల పైచిలుకు లైకులు లభించాయి.

ఇక వ్యక్తిగత వెబ్ సైట్లు ప్రారంభించిన నేతల సంఖ్యా తక్కువేం కాదు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీ నేతలైనా కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ - హోంమంత్రి రమేశ్ చిన్నితల - సీపీఎం పోలిట్ బ్యూరో మెంబర్  పినరాయి విజయన్  - బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కుమ్మరం రాజశేఖరన్ - కేపీసీసీ చీఫ్ వీఎం సుధీరన్ తదితరులు సోషల్ మీడియా లో ప్రచారం ముమ్మరం చేశారు. టెక్నాలజీ వాడకంలో ముందుండే ఊమెన్ చాందీ ఏప్రీల్ 2010 లోనే ఫేస్ బుక్ ఖాతా తెరిచారు. తద్యారా సోషల్ మీడియీకు ఏర్పడబోతున్న ప్రబలమైనా ప్రజాదరణను ముందుగానే పసిగట్టిన నాయకుల్లో ఒకరిగా చాందీ నిలిచారు. పదిసార్లు ఎమ్మెల్యేగా - రెండు దఫాలు ముఖ్యమంత్రి గా పసిచేసిన ఆయన.. ట్విట్టిర్ - ఫేస్ బుక్ లలో క్రమంలో తప్పకుండా పోస్టులు పెడుతూ వస్తున్నారు. ఆయన నియోజకవర్గాన్ని సందర్శించిన వివరాలు - పర్యాటనలు  - ఇతరత్రా కార్యక్రమాలే కాదు. మంత్రి వర్గ సమవేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు, ప్రభుత్వ పధకాలు - విధానాలను సైతం సామాజిక మాద్యమాల్లో పోస్టు చేస్తున్నారు. ఆయన ఫేస్ బుక్ కి తొమ్మిదిలక్షలమందికి పైబడి లైకులు కురిపించారు. దీంతో పాటు ఆయన సొంతంగా ఒక వ్యక్తిగత వెబ్ పైట్ ను సైతం ప్రారంభించారు. తన నియోజకవర్గం పాతుప్పల్లి నుంచి 11వ సారి శాసనసభకు ఎన్నికయ్యేలా పావులు కదుపుతున్నారు.

కాగా ప్రముఖ మార్క్సిస్టు నాయకుడు అచ్యుతానందన్ ఫేస్ బుక్ ద్యారా సోషల్ మీడియాలోకి అడుగుపెట్టడంతోనే మెఖ్యమంత్రి చాందీకి ఆయనకు మధ్య మాటల యుధ్ధం తెరలేచింది. వీఎన్ అచ్యుతానందన్ సోషల్ మీడియాలోకి అడుగుపెట్టడాన్ని ఆహ్వానించిన ముఖ్యమంత్రి ఊమన్ చాందీ.. ‘‘ఒకప్పుడు వీఎన్ తో పాటు ఆయన పార్టీ నేతలు కంప్యూటర్ కు దయ్యం అని పేరుపెట్టారు. యువత నుంచి ఉద్యోగావకాశాలను లాగేసుకుంటోందని విమర్శించారు. చివరికి వారే ఇప్పుడు పోషల్ మీడియాని హత్తుకున్నారని తెలిసి నేను చాలా సంతోషిస్తున్నాను’’ అని పోస్టు చేశారు. దీనికి అచ్యుతానందన్   ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫేస్ బుక్ ద్వారానే పదునైనా సమాధానం చెప్పారు.
Tags:    

Similar News