తెలంగాణ ఎన్నిక‌ల‌పై రావ‌త్ వ్యాఖ్య‌ల మ‌ర్మ‌మేంది?

Update: 2018-09-28 05:04 GMT
ఆత్మ‌విశ్వాసానికి ఒక రూపునిస్తే తెలంగాణ ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాదిరి ఉంటుంద‌న్న మాట ప‌లువురు టీఆర్ఎస్ నేత‌ల నోట వినిపిస్తూ ఉంటుంది. ఏ మాట‌కు ఆ మాటే చెప్పాలి.. కేసీఆర్ లోని గొప్ప ల‌క్ష‌ణాల్ని ఆయ‌న ప్ర‌త్య‌ర్థులు సైతం త‌ర‌చూ ప్ర‌స్తావిస్తుంటార‌ని చెబుతుంటారు. తాను అనుకున్న‌ది అనుకున్న‌ట్లుగా జ‌ర‌గ‌టానికి తానేం చేయాలో అన్ని చేసేయ‌టం.. ప‌క్కాగా ప్లాన్ సిద్ధం చేయ‌టం.. వాటిని అమ‌లు చేయ‌టానికి అవ‌సర‌మైన బ్యాక్ గ్రౌండ్ త‌యారు చేయ‌టం లాంటివి కేసీఆర్ లో క‌నిపించే సుగుణాలు.

తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు సంబంధించి ఆయ‌న చేసిన క‌స‌ర‌త్తు అంతా ఇంతా కాదు. అయితే.. ఎంత చేసినా.. అంతిమంగా నిర్ణ‌యం తీసుకోవాల్సింది.. ఎన్నిక‌ల్ని నిర్వ‌హించాల్సింది స్వ‌తంత్ర వ్య‌వ‌స్థ అయితే కేంద్ర ఎన్నిక‌ల సంఘానిదే. వీలైతే నాలుగు రాష్ట్రాల ఎన్నిక‌ల‌కు ముందే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ను పూర్తి చేయాలని కేసీఆర్ త‌పిస్తున్నారు. ఇందుకు త‌గ్గ‌ట్లే ప‌క్కా ప్లాన్ వేశారు.

ఇదిలా ఉంటే.. కేసీఆర్ ఆలోచ‌న‌ల‌కు భిన్నంగా ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయా? అన్న సందేహం వ్య‌క్త‌మ‌య్యేలా తాజాగా కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ఒ.పి. రావ‌త్ వ్యాఖ్య‌లు ఉండ‌టం గ‌మ‌నార్హం. ఒక ప్ర‌ముఖ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ నాలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను డిసెంబ‌రు 15 లోపు పూర్తి చేయాల‌న్న ఆయ‌న‌.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల అంశంలో మాత్రం మ‌రో ర‌కంగా రియాక్ట్ కావ‌టంపై ఆస‌క్తి వ్య‌క్త‌మ‌వుతోంది. తెలంగాన‌లో ఎన్నిక‌ల తేదీకి సంబంధించి ఇంకా నిర్ణ‌యానికి రాలేద‌న్న ఆయ‌న‌.. తెలంగాణ‌లో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ఇంకా ఆర్నెల్లు గ‌డువు ఉంద‌ని చెప్ప‌టం ఇప్పుడు కొత్త ఆలోచ‌న‌ల‌కు తెర తీసింద‌ని చెప్పాలి.

తెలంగాణ‌కు అధికారుల బృందం వెళ్లింద‌ని.. అక్క‌డి క్షేత్ర‌స్థాయి ప‌రిస్థితుల్ని ప‌రిశీలించిన త‌ర్వాత నిర్ణ‌యాన్ని వెల్ల‌డిస్తామ‌ని చెప్ప‌టం గ‌మ‌నార్హం.

తాజాగా రావ‌త్ వ్యాఖ్య‌లు వింటే గులాబీ బాస్ గుండె గుభేల్ లా ఉన్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఎన్నిక‌ల్ని నాలుగురాష్ట్రాల‌తో పాటు కానీ.. అంత‌కంటేముందే క్లోజ్ చేయాల‌ని త‌పిస్తున్న వేళ‌.. అందుకు భిన్నంగా ఆయ‌న వ్యాఖ్య‌లు ఉన్నాయి. నాలుగు రాష్ట్రాల‌తో క‌లిసి తెలంగాణ అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌రిపేందుకు అవ‌కాశాలు ఉన్న‌ట్లుగా ఆయ‌న చెప్ప‌టం ఒక ఎత్తు అయితే.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న నోటి వెంట వ‌చ్చిన కీల‌క వ్యాఖ్య‌లు మ‌రో ఎత్తు.

నాలుగు రాష్ట్రాల‌తో క‌లిసి ఎన్నిక‌లు నిర్వ‌హించే అవకాశం ఉందా? అన్న ప్ర‌శ్న‌కు.. అవ‌కాశానికి హ‌ద్దేముంటుంది?  ఆకాశమే హ‌ద్దు అన‌టంలో మ‌ర్మ‌మేంటి? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. చూస్తూ.. చూస్తూ..రావ‌త్ మాష్టారు  కేసీఆర్ ఎంత‌మాత్రం ఊహించని రీతిలో నిర్ణ‌యాలు తీసుకోరు క‌దా?
Tags:    

Similar News