క‌ర్ణాట‌క‌లో హంగ్‌..ఆ పార్టీయే కీల‌కం

Update: 2018-04-13 16:14 GMT
పొరుగు రాష్ట్రమైన క‌ర్ణాట‌క ఎన్నిక‌లు దేశ‌వ్యాప్తంగా ఉత్కంఠ‌ను రేకెత్తిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి, ప్ర‌తిప‌క్షంలో ఉన్న కాంగ్రెస్‌కు ఈ ఎన్నిక‌లు భ‌విష్య‌త్‌ను నిర్దేశించివిగా మారనున్నాయ‌నే విశ్లేష‌ణ‌ల నేప‌థ్యంలో ఆస‌క్తిక‌ర అంచ‌నాలు వెలుగులోకి వ‌చ్చాయి.  కర్ణాటకలో హంగ్‌ ఏర్పడే అవకాశం ఉందని ఇండియా టుడే-కార్వీ ఒపీనియన్‌ పోల్‌ ఫలితాలు తేల్చిచెప్పాయి.  ప్రాంతీయ పార్టీ అయిన జేడీఎస్‌ ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారనుంద‌ని తేలింది. కాంగ్రెస్‌ పార్టీనే మరోసారి పెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉందని సంస్థ తెలిపింది.

ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య ప‌నితీరుపై మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చింద‌ని ఇండియాటుడే-కార్వీ ఒపీనియ‌న్ పోల్ తెలిపింది. 33 శాతం ప్రజలు సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా కోరుకుంటుండ‌గా 31 శాతం మంది సీఎం సిద్దరామయ్య పనితీరు పర్వాలేదని చెప్పారు. 29 శాతం మంది సీఎం సిద్దరామయ్య పనితీరు ఏ మాత్రం బాగాలేదని వెల్లడించారు. 21 శాతం మంది జేడీఎస్ నేత హెచ్ డీ కుమారస్వామి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. అధికార‌ కాంగ్రెస్‌కు 90-101 సీట్లు వచ్చే అవకాశం ఉంద‌ని ఈ ఒపినియ‌న్ పోల్ తేల్చింది. బీజేపీకి 78-86 సీట్లు, జేడీఎస్‌కు 34-43 సీట్లకు ఛాన్స్‌, ఇతరులు 4-7 సీట్లు దక్కించుకోవచ్చున‌ని పేర్కొంది. త‌ద్వారా ప్రభుత్వ ఏర్పాటులో జేడీఎస్ ముఖ్య శ‌క్తిగా ఎద‌గ‌నుంద‌ని జోస్యం చెప్పింది.
Tags:    

Similar News