దేశంలో ఇప్పటివరకూ ఒకపక్షం వాదన మాత్రమే బలంగా వినిపించటం.. మరొకటి అస్సలు వినిపించకపోవటం గత కొద్దికాలంగా నడుస్తున్నదే. అయితే.. ఈ విషయాన్ని బలంగా చెప్పేవారు కానీ.. అర్థమయ్యేలా చెప్పే మాధ్యమం కానీ లేకపోవటంతో కొందరి మాటలే నిజాలుగా.. అవే అసలుసిసలు సత్యాలుగా ప్రచారం సాగుతున్న పరిస్థితి. అయితే.. సోషల్ మీడియా పుణ్యమా అని.. ప్రజలు ఏమనుకుంటున్నారు? వారి వైఖరి ఏమిటి? వారేం కోరుకుంటున్నారన్న విషయాలు చాలా స్పష్టంగా బయటకు వస్తున్న పరిస్థితి.
ఇదిలా ఉంటే తమ రాజకీయ ప్రయోజనాలకు తగ్గట్లుగా మాట్లాడే కాంగ్రెస్ ద్వంద వైఖరిపై ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. దీనికి తోడు కేంద్రంలో ఎన్డీయే సర్కారు ఉండటంతో.. వ్యవస్థ లోతుల్లో కప్పేసిన చాలా వికారాలు బయటకు వస్తున్న పరిస్థితి. విశ్వవిద్యాలయాల్లో భావస్వేచ్ఛ పేరిట ఎంత అనాగరికమైన వాదనల్ని వినిపిస్తున్నారో.. చర్చించుకుంటున్నారన్న విషయం తాజాగా లోక్ సభలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తన ప్రసంగంతో బయటపెట్టారు.
ఉబుసుపోకు మాటలకు పరిమితం కాకుండా.. తాను చెప్పే ప్రతి మాటకు సంబంధించి తగిన ఆధారాలు చూపిస్తూ ఆమె తన ప్రసంగాన్ని సాగించటం.. ఈ ప్రసంగాన్ని విన్న వారు.. మీడియాలో చూసిన వారు విశ్వవిద్యాలయాల్లో భావస్వేచ్ఛ పేరిట ఏం జరుగుతుందన్న విషయానికి సంబంధించి రెండో కోణాన్ని తెలుసుకునే అవకాశం దక్కింది.
ఇప్పటివరకూ తాము చేసిన ప్రచారం చేసిన దానికి భిన్నంగా.. సత్యం బయటకు రావటం.. భావస్వేచ్ఛ పేరు మీద జరిగే చర్చల సారాంశం తెలుసుకున్న వారంతా షాక్ అయ్యే పరిస్థితి. ఇదిలానే కొనసాగితే.. తమ ఆస్తిత్వానికే ముప్పు వాట్లితుందన్న భయం కాంగ్రెస్.. కమ్యూనిస్ట్ లకు పెరిగింది. దీంతో.. మొదటి రోజు స్మృతి సునామీతో షాక్ తిన్న వారు.. ఇప్పుడిప్పుడే కోలుకుంటూ తమ వాదనలకు పదును పెట్టటం మొదలు పెట్టారు. ఇందులో భాగంగా తాజాగా వారో చిత్రమైన వాదనను తెర మీదకు తీసుకొచ్చారు. దుర్గాదేవిని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అవమానించారంటూ వ్యాఖ్యానించటమే కాదు.. ఆమె తాను చేసిన వ్యాఖ్యలకు సారీ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
స్మృతి ఇరానీ చెప్పే వరకూ.. బీసీ.. ఎస్సీ.. ఎస్టీ.. మైనార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తామని చెప్పుకునే కొంతమందితో కూడిన సమూహం దుర్గాదేవి మీద వేసిన పోస్టర్.. అందులో దుర్గామాత గురించి ఏం రాశారో దేశ ప్రజలకు తెలీని పరిస్థితి. అలాంటి పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేయాల్సిన రాజకీయ పార్టీలు.. ఆ విషయాల్ని తెరపైకి తీసుకొచ్చిన కేంద్రమంత్రిని సారీ చెప్పాలనటం గమనార్హం. తమ నీచమైన భావాల్ని వ్యక్తపర్చిన సమూహాన్ని అదుపులోకి తీసుకొని చట్టబద్ధంగా శిక్షించాలన్న డిమాండ్ ను వదిలేసిన విపక్షాలు.. కఠోర వాస్తవాలు బయటపెట్టిన స్మృతిని సారీ చెప్పాలని కోరటం దేనికి నిదర్శనం..?