తెలంగాణ అసెంబ్లీకి సంబంధించి ఒక విషయాన్ని గొప్పగా చెప్పాలి. సీనియర్ నేతల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవంగా సంబోధించటమే కాదు.. వారి పట్ల విపరీతమైన మర్యాదతో వ్యవహరిస్తుంటారు. అదే సంప్రదయాన్ని తన పార్టీ నేతలుకూడా అనుసరించేలా ఆయన చూస్తుంటారు. అయితే.. ఇందుకు భిన్నంగా టీఆర్ ఎస్ ఫైర్ బ్రాండ్ తలసాని శ్రీనివాసయాదవ్ చెలరేగిపోవటం తెలంగాణ అసెంబ్లీలో రచ్చగా మారింది.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డిని ఉద్దేశించి తలసాని మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సభలో గందరగోళానికి కారణం అయ్యాయి. తలసాని మాటల్ని కాంగ్రెస్ నేతలు తప్పు పట్టారు. కరువుపై చర్చ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతున్న సందర్భంలో మంత్రి తలసాని ఏదో వ్యాఖ్య చేశారు. దీనికి స్పందించిన జీవన్ రెడ్డి.. సిటీలో ఉండే తలసానికి కరువు కష్టాలు ఏం తెలుసు? అంటూ పంచ్ వేశారు.
దీంతో రియాక్ట్ అయిన తలసాని.. ‘‘ప్రపంచంలో ఈయనొక్కడే మేధావి అయినట్లు.. అయనొక్కడే వ్యవసాయం చేస్తున్నట్లు.. ఊళ్లన్నీ ఈయనే తిరుగుతున్నట్.. ఆయనేదో పొడిచేసినట్లు.. మేమేదో పొడవనట్లుగా ఏంటా విమర్శలు’’ అంటూ మండిపడ్డారు. తలసాని దూకుడు మాటలపై కాంగ్రెస్ నేతలు తప్పు పట్టారు. కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందిస్తూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం గౌరవించే జీవన్ రెడ్డిని మంత్రి తలసాని ఏకవచనలో సంభోదించటం బాగోలేదని.. నువ్వు గివ్వు.. పొడిచేస్తాడా? లాంటి మాటలేమిటంటూ ప్రశ్నించటమే కాదు.. మోండా మార్కెట్ నుంచి వచ్చిన శ్రీనివాస్ యాదవ్ అలా మాట్లాడొద్దు.. కనీసం వయసుకైనా మర్యాద ఇవ్వాలి కదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేయటం కనిపించింది. ఏమైనా.. తలసాని లాంటి వారి విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కాస్త కల్పించుకొని హితువు చెప్పాల్సిన అవసరం ఉంది.