జ‌గ‌న్ నిర్ణ‌యాలపై ప్ర‌తిప‌క్షాల దోబూచులు..వ్య‌తిరేకించ‌లేవు..వ‌ద్ద‌న‌లేవు..!

Update: 2019-12-18 17:30 GMT
ఔను! క‌రడు గ‌ట్టిన జ‌గ‌న్ వ్య‌తిరేకులు - నిత్యం ఆయ‌న‌ను తిట్టిపోసే.. ప్ర‌తిప‌క్ష నాయ‌కులు సైతం ఇప్పుడు కుడితిలో ప‌డిపోయిన ఎలుక‌ల మాదిరిగా కొట్టుకుంటున్నారు. ఆయ‌న‌ను వ్య‌తిరేకించేవారు.. ఆయ‌న పాల‌న‌ను కూడా తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే, ఎవ‌రు ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్ని మాట లు అన్నా.. ఎన్ని వ్యాఖ్య‌లు చేసినా.. ఇటీవ‌ల గ‌డిచిన అసెంబ్లీ శీతాకాల స‌మావేశాల్లో జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాల‌ను - ఆయ‌న తీసుకు వ‌చ్చిన బిల్లుల‌ను మాత్ర‌మే కాకుండా రాజ‌ధానిపై జ‌గ‌న్ చేసిన సంచ‌ల‌న ప్ర‌క‌ట‌నను కూడా త‌ప్పుప‌ట్ట‌లేక పోతున్నారు. విమ‌ర్శించ‌లేక పోతున్నారు.

వ‌రుస‌గా విష‌యాల‌ను ప‌రిశీలిస్తే.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఆంగ్ల మీడియం - హైద‌రాబాద్ దిశ ఘ‌ట‌న త‌ర్వా త తీసుకువ‌చ్చిన ఏపీ దిశ చ‌ట్టం -2019 - మ‌ద్య నియంత్ర‌ణ బిల్లు - తాజాగా రాజ‌ధానిపై చేసిన ప్ర‌క‌ట‌న . ఇలా జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన బిల్లులు సంచ‌ల‌నాల‌కే సంచ‌ల‌నంగా మారాయి. వీటిని వ్య‌తిరేకించాల‌ని ఉన్నా.. విప‌క్షాలు సాహ‌సం చేయ‌లేక పోతున్నాయి. మొద‌ట్లో ప్ర‌భుత్వ స్కూళ్ల‌లో ఆంగ్ల మాధ్య‌మాన్ని తీసుకురావ‌డాన్ని వ్య‌తిరేకించారు. తీవ్ర‌స్థాయిలో తెలుగు కోసం.. క‌న్నీరు పెట్టుకున్నారు.

కానీ, ఒకే ఒక్క షాట్‌ తో జ‌గ‌న్ ఈ వ్య‌తిరేక‌త‌ను కుప్ప‌కూల్చారు. మీ పిల్ల‌లు ఎక్క‌డ చ‌దువుతున్నారో చెప్పండి..! అంటూ ప్ర‌శ్నించ‌డంతో ప్ర‌శ్నించిన వారు ప‌క్క‌కు జారుకున్నారు. ఇక‌, దిశ ఘ‌ట‌న‌పై వ్య‌తిరేకించాల‌ని చూసినా.. ఆ విష‌యంలోనూ ప్ర‌తిప‌క్షాలు చేతులు ఎత్తేశాయి. ఏ విష యంలో విమ‌ర్శించినా.. తాము మ‌హిళ‌ల‌కు వ్య‌తిరేక‌మ‌నే భావ‌న తెర‌మీదికి వ‌చ్చి ఓటు బ్యాంకుకు ఎక్క‌డ గండి ప‌డుతుందోన‌ని అంద‌రూ మౌనం వ‌హించారు.  అయితే ఇందులో వ్య‌తిరేకించ‌డానికి ఎక్క‌డా అవ కాశం కూడా లేక పోవ‌డం గ‌మ‌నార్హం.

ఇక‌, ఇప్పుడు కీల‌క‌మైన రాజ‌ధానిపై జ‌గ‌న్ చేసిన ప్ర‌క‌ట‌న‌ను విమర్శించాల‌ని అనుకున్నా.. ప్రాంతాల విష‌యంలో చిచ్చు పెడుతున్నార‌నే అప‌వాదుతో పాటు భారీ ఎత్తున వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌ని ఇప్పుడు తేలుకుట్టిన విధంగా నాయ‌కులు మౌనం వ‌హిస్తున్నారు. ఈ మొత్తం ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్ పై పీక‌ల దాకా కోపం ఉన్న నాయ‌కులు కూడా ఆయ‌న తీసుకుంటున్న నిర్ణ‌యాల‌కు జై కొట్టాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డడం, రాజ‌కీయంగా చిత్రంగా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.


Tags:    

Similar News