ప్రధాని నరేంద్ర మోడీపై ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతోంది. ముఖ్యంగా 2014లో ఆయన తొలి సారి ప్రధాని అయిన నాటి నుంచి నేటి వరకు జరిగిన పరిణామాలపై కొందరు తీవ్ర విమర్శలే చేస్తున్నారు.. ఆయనను వరెస్ట్ ప్రధానిగా పేర్కొంటూ... అనేక వివరాలతో ఓ యువకుడు చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం గమనార్హం. ఇంతకీ ఈ వీడియోలో యువకుడు ఏం చెప్పాడంటే.. మోడీ అధికారంలోకి వచ్చిన ఆరున్నరేళ్లలో దేశాన్ని తీవ్రంగా ముంచేశారని ఆరోపించారు..
మోడీ అపరిపక్వ విధానాలు, పాలన కారణంగా దాదాపు వంద కంపెనీలు నష్టాల ఊబిలో చిక్కుకుపోయి.. అల్లాడుతున్నాయని వివరించారు. ప్రస్తుతం భారత దేశం 500బిలియన్ డాలర్ల అప్పులో ఉంది. ఇక, తీవ్ర నష్టాల్లో ఉన్న మేజర్ కంపెనీలు ఏంటంటే..
కంపెనీ నష్టం
వోడా ఫోన్ 50 వేల కోట్లు
ఎయిర్‌టెల్ 23 వేల కోట్లు
బీఎస్ ఎన్ ఎల్ 14 వేల కోట్లు
ఎంటీఎన్ ఎల్ 755 కోట్లు
బీబీసీఎల్ 750 కోట్లు
సెయిల్ 286 కోట్లు
ఎయిర్ ఇండియా 4600 కోట్లు
స్పైస్ జెట్ 463 కోట్లు
ఇండిగో 1063 కోట్లు
బీహెచ్ ఈఎల్ 219 కోట్లు
ఇండియా పోస్ట్ 15000 కోట్లు
సీఎంఆర్ ఇన్ ఫ్రా 561 కోట్లు
ఎస్ బ్యాంకు 600 కోట్లు
యూనియన్ బ్యాంకు 1190 కోట్లు
పంజాబ్ నేషనల్ బ్యాంకు 4715 కోట్లు
యాక్సిస్ బ్యాంకు 111 కోట్లు
జేపీ గ్రూప్ ............ పూర్తిగా నష్టాల్లో మునిగిపోయింది
వీడియో కాన్ ........పూర్తిగా దివాలా
ఎయిర్ సెల్, డొకొమో ...... దివాలా
ఇక, ఐదు అత్యంత కీలకమైన ఎయిర్ పోర్టులను గుజరాత్‌కు చెందిన ఆదానీకి అమ్మేశారు.
అదేవిధంగా రైల్వేలను కూడా అమ్మేస్తున్నారు. సాంస్కృతిక కట్టడాలైన రెడ్ ఫోర్ట్ వంటివాటిని కూడా అద్దెకు ఇచ్చేస్తు న్నారు. అనేక బ్యాంకుల శాఖలను మూసేశారు. ఏటీఎంలను క్లోజ్ చేశారు. అనేక బ్యాంకులను మూసేస్తు న్నారు. 36 మంది రుణ ఎగవేత దారులు మోడీ హయాంలో దేశం విడిచి పారిపోయారు. కొద్ది మంది అతి సంపన్నులకు చెందిన 2.45 లక్షల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేశారు. దేశంలో పేదలకు, రైతుల కు మాత్రం చేయకపోవడం దురదృష్టకరం.
అదేవిధంగా మోడీ పాలనలో బీఎస్ ఎన్ ఎల్లో 54 వేల ఉద్యోగాలను తీసేశారు. ఇంకా మరింత మందిని తీసేసేందుకు ప్రణాళిక వేసుకున్నారు. ఆటో ఇండస్ట్రీలో పది లక్షల ఉద్యోగాలు పోనున్నాయి. భారత దేశ ప్రతిష్టాత్మక సంస్థ.. మారుతి కంపెనీ పూర్తిగా ఉత్పత్తిని ఆపేసింది. 55 వేల కార్లు కొనేందుకు ఎవరూ ముందుకు రాలేని పరిస్థితి ఏర్పడింది. 30 ప్రధాన నగరాల్లోని 12.76 లక్షల ఇళ్లు కొనేవారు లేక బూజు పడుతున్నాయి. బిల్డర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నిర్మాణ రంగంలో జీఎస్టీ 18 నుంచి 28 శాతానికి పెంచడంతో నిర్మాణ రంగం కుదేలైంది.
కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగానే కాఫీ డే వ్యవస్థాపకుడు సిద్ధార్థ ఆత్మహత్య చేసుకున్నారు. హాల్ కంపెనీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. బిస్కట్ కంపెనీలు కూడా తమ ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి. అత్యంత లాభాల్లో ఉన్న ఓ ఎన్ జీసీ కంపెనీ.. నేడు నష్టాల్లో ఉంది. ఇక, నోట్ల రద్దు కారణంగా.. లక్షల మంది ఉద్యోగాలు, ఉపాది కోల్పోయారు. ఇక, మరో కీలక పరిణామం ఏంటంటే.. భారత్‌లోని మీడియా పూర్తిగా మోడీకి, అమిత్ షాకు అమ్ముడు పోయింది. ఇక, ప్రధాని, హోం మంత్రి సహా అనేక మంది కీలక పోస్టుల్లో ఉన్న వారంతా కూడా గుజరాత్‌కు చెందిన వారే కావడం గమనార్హం.
ఇక, బీజేపీ నాయకులు హిందూత్వం, రామమందిరం, ఆర్టికల్ 370 వంటివాటి గురించి మాట్లాడుతున్నారే తప్ప.. ప్రజలు ఏం కోరుకుంటున్నారనే విషయాలపై మాత్రం దృష్టి పెట్టడం లేదని ఈయన పేర్కొన్నారు. నిరుద్యోగం, పేదరికం తగ్గించడం, జీడీపీ పెంచడం వంటి కీలక అంశాలపై ఈ ప్రభుత్వం దృష్టి పెట్టనప్పుడు.. మోడీకి ఎందుకు ఓటేయాలనేది ఈయన ప్రధాన ప్రశ్న. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో భారీ ఎత్తున వైరల్ అవుతుండడం గమనార్హం.
Full View