అక్కడ విపక్షాలు వెయిటింగ...జగన్ చాన్స్ ఇస్తార...?

Update: 2022-03-27 03:30 GMT
ఏపీలో పొలిటికల్ గేర్ మార్చాలంటే ప్రస్తుతం ఉన్న జోరు ఏ మాత్రం సరిపోవడంలేదు. ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమాలతో పాటు హైకోర్టు అమరావతి రాజధానికి అనుకూలంగా ఇచ్చిన తీర్పుతో ఏపీలో ప్రతిపక్ష పార్టీల విశ్వాసం బాగా పెరిగిన సంగతి తెలిసిందే. ఇక మాజీ మంత్రి వివేక హత్య కేసులో సీబీఐ దూకుడుతో పాటు, జంగారెడ్డిగూడెం కల్తీ సారా మరణాల వంటి ఇష్యూస్ తో విపక్ష రధానికి ఏ రోజుకు ఆ రోజు రాజకీయ  ఇంధనం లభిస్తున్నా పూర్తి స్థాయి పట్టు అయితే దొరకడంలేదు.

దాంతో విపక్షాలు అంతా ఇపుడు జగన్ వైపే చూస్తున్నాయి. ఒక విధంగా వారంతా వెయిట్ చేస్తున్నారు అనుకోవాలి. మరి విపక్షాలు ఎందుకు జగన్ వైపు చూపు సారిందాయి అంటే ఆయనే ఏపీలో రాజకీయాన్ని మార్చగలడు కాబట్టి.

జగన్ రాజకీయం మారిస్తే అది వైసీపీకి అనుకూలంగా ఉంటుంది కానీ విపక్షాలకు ఏం లాభం అంటే అక్కడే ఉంది మతలబు. ఏపీలో విపక్షాలకు ఇపుడు సరైన టైం వచ్చింది అంటున్నారు. ఎటూ మూడేళ్ళ వైసీపీ పాలన ముగుస్తోంది.

ఇది ఒక విధంగా కీలకమైన వేళ. ఈ సమయంలో జగన్ మంత్రివర్గ విస్తరణకు పూనుకున్నారు. ఇలాంటి టైం లో మంత్రివర్గం విస్తరణ అంటే కొంతమందిని మార్చి ఊరుకోవచ్చు. ఆ విధంగా పెద్దగా అసంతృప్తి లేకుండా ఆపుకోవచ్చు. కానీ జగన్ తొంబై శాతానికి పైగా మంత్రులను మార్చబోతున్నారు.

అంటే ఇది సాహసంతో  కూడుకున్న విషయమే అంటున్నారు. మాజీలు అవుతున్న మంత్రులు ఒక వైపు గుర్రుగా ఉంటారు. మంత్రి పదవుల మీద ఆశలు పెట్టుకుని రాకపోతే ఫైర్ అయ్యేవారూ తయారుగా  ఉంటారు. ఒక విధంగా చెప్పాలీ అంటే జగన్ తో పాటు కొలువుతీరే ఇరవై నాలుగు మంది మంత్రులు తప్ప తక్కిన వారు అంతా కూడా ఏదో ఒక కారణంతో అసమ్మతి జెండా ఎగరేసే సీన్ అయితే ఉంది.

ఇందులో జూనియర్లను, సన్నిహితులను కాస్తో కూస్తో బుజ్జగించవచ్చు కానీ సీనియర్లను, రాజకీయంగా తల పండిన వారిని దారికి తేవడం బహు కష్టమే. దాంతో వారు రేపటి రోజున బాహాటంగా తమ అసంతృప్తిని వెళ్ళగక్కితే మాత్రం వైసీపీ బిగ్  ట్రబుల్స్ లో పడుతుంది.

సరిగ్గా ఆ టైం కోసమే ఏపీలో విపక్షాలు టోటల్ గా వెయిట్ చేస్తున్నాయి. మంత్రి వర్గ విస్తరణ పర్వం ముగిస్తే ఇక పదవుల పందేరానికి నో చాన్స్. డైరెక్ట్ గా ఎన్నికలకు వెళ్ళిపోవడమే. దాంతో ఇన్నాళ్ళూ ఎంతలా లోపల అసహనం ఉన్నా దాన్ని అణచిపెట్టుకుని అధికార పార్టీ జనాలు చాలా మంది వేచి ఉన్నారు. మరి మంత్రి వర్గంలో తమకు బెర్త్ దొరకకపోతే మాత్రం చాలా మంది అసమ్మతి రాగాలు ఆలపించే చాన్స్ ఉందని భోగట్టా.

వారు కనుక మీడియా ముందుకు వస్తే మైకులు అందుకుంటే ఏపీలో రాజకీయం గేర్ మార్చినట్లే అంటున్నారు. అపుడు విపక్ష రాజకీయం జోరందుకుంటుంది అని లెక్కలు వేస్తున్నారు. ఈ సంగతులు అన్నీ జగన్ కి కూడా తెలియకుండా ఉంటాయా. అందుకే ఆయన ఎటువంటి అసంతృప్తి లేకుండానే విస్తరణ యాగాన్ని పూర్తి చేయాలనుకుంటున్నారు. కానీ ఇది రాజకీయం కాబట్టి ఏమైనా జరగవచ్చు. మరి విపక్షాల వెయిటింగ్ కి తగిన రిజల్ట్ వస్తుందా. జగన్ వారికి ఆ చాన్స్ ఇస్తారా. వెయిట్ అండ్ సీ.
Tags:    

Similar News