అస‌లు ఓట్లు 9600.. పోల్ అయింది 600.. వేసుకుంది 2900

Update: 2021-04-13 09:30 GMT
ఏపీలో ఇటీవ‌ల జ‌రిగిన ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో అనేక చిత్రాలు వెలుగు చూశాయి. కేవ‌లం నాలుగు రోజులు మాత్ర‌మే ప్ర‌చారానికి గ‌డువు ఇవ్వ‌డంతో ప్ర‌తిప‌క్షాలు కోర్టుకు వెళ్ల‌డం.. ఎన్నిక‌ల‌ను మొద‌టి నుంచి నిర్వ‌హించాల‌ని కోర‌డం.. కోర్టు వీరి అభ్య‌ర్థ‌న‌ను ప‌క్క‌న పెట్టి.. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం తెలిసిందే. ఇక‌, ఈ ఎన్నిక‌ల‌ను టీడీపీ అధినేత చంద్ర‌బాబు బ‌హిష్క‌రించ‌డం కూడా ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో సంచ‌ల‌నంగా మారింద‌నే చెప్పాలి. అయితే.. పార్టీ అధినేత చంద్ర‌బాబు బ‌హిష్క‌రించినా.. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కులు మాత్రం వెన‌క్కి త‌గ్గ‌కుండా ప్ర‌చారం చేసుకుని పోటీలో నిలిచారు.

అయితే.. టీడీపీ ఏజెంట్లు లేక పోవ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, మ‌రోవైపు.. బీజేపీ-జ‌న‌సేన కూట‌మి ఇర‌గ‌దీద్దామ‌ని భావించింది. అయితే.. ఈ పార్టీకి కూడా ఏజెంట్లు లేక పోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇక‌, ఇవ‌న్నీ ఒక విష‌యం అయితే.. మ‌రో కీల‌క విష‌యం కూడా ఉంది. ప‌శ్చిమ ప్ర‌కాశం జిల్లాలోని ఒక మండ‌ల కేంద్రంలో చిత్ర‌మైన ఘ‌ట‌న తెర‌మీదికి వ‌చ్చింది. ఇక్క‌డ మొత్తం 9600 ఓట్లు ఉన్నాయి. ఇక్క‌డ నుంచి వైసీపీ స‌హా జ‌న‌సేన నుంచి కొంద‌రు ఇండిపెండెంట్లు పోటీ చేశార‌రు. అయితే.. ఇక్క‌డ కూడా జ‌న‌సేన‌కు ఏజెంట్లు లేక పోవ‌డం గ‌మ‌నార్హం.

ఇక‌, పోటీలో పెద్ద‌గా ప్ర‌త్య‌ర్థులు లేక‌పోవ‌డంతో అధికార పార్టీ నేత‌లు డ‌బ్బులు పంచ‌లేదు. ఈ ప్ర‌భావంతో ఓట‌ర్లే ఎన్నిక‌ల‌ను బాయ్‌కాట్ చేశారు. ఈ క్ర‌మంలో 9600 ఓట్ల‌కు గాను కేవ‌లం 600 ఓట్లు మాత్ర‌మే పోల్ అయ్యాయి. ఈ విష‌యాన్ని మైకులోనే ప్ర‌క‌టించారు. కానీ, సాయంత్రం 3 గంట‌ల త‌ర్వాత సీన్ మొత్తం మారిపోయింది. రంగంలోకి దిగిన వైసీపీ నాయ‌కులు.. మ‌రో 2900 ఓట్లు వేసుకున్న‌ట్టు పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. మొత్తంగా సాయంత్రం 5 గంట‌ల కు ఇక్క‌డ 3500 ఓట్లు పోలైన‌ట్టు ప్ర‌క‌టించారు.

ఈ మొత్తం ఎపిసోడ్‌లో తేలింది ఏంటంటే.. ఓట్ల‌కు డ‌బ్బులు ఇవ్వ‌క‌పోతే.. ఓట‌ర్లు పోలింగ్ బూత్‌కు వ‌చ్చే ప‌రిస్థితి లేద‌ని స్ప‌ష్ట‌మైంది. నిజానికి ప్ర‌భుత్వం ఎన్నో ప‌థ‌కాలు అమ‌లు చేస్తోంది. అయిన‌ప్ప‌టికీ.. వాటి ప్ర‌భావం ఎక్క‌డా క‌నిపించ‌లేదు. దీంతో ఓట‌ర్లు ఒక‌ర‌కంగా బ‌హిష్క‌రించారు. టీడీపీ బాయ్‌కాట్ చేసిన నేప‌థ్యంలో ఓట‌ర్లు రాలేద‌ని టీడీపీ నేత‌లు చెప్పుకొంటున్నారు. వైసీపీ వారేమో.. మేమే సైక్లింగ్ చేసుకున్నామ‌ని.. బ‌హిరంగ వ్యాఖ్య‌లు చేస్తున్నారు. మొత్తంగా రెండు కీల‌క పార్టీల ప‌రిస్థితిని చూస్తే.. రాష్ట్రంలో ప్ర‌జాస్వామ్యం ఏరేంజ్‌లో వ‌ర్ధిల్లుతోందో అర్ధ‌మ‌వుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 
Tags:    

Similar News