మీ సెక్యూరిటీకి మా గ్యారంటీ..టిక్ టాక్ నిషేధం సి‌ఈ‌ఓ స్పందన!

Update: 2020-07-01 10:50 GMT
లడఖ్‌ లోని గాల్వన్ వ్యాలీలో జూన్ 15 న జరిగిన చైనా, భారతదేశ మధ్య ఘర్షణల నేపథ్యంలో చైనాపై భారీ ఆర్థిక దెబ్బ తీసేందుకు భారత ప్రభుత్వం టిక్‌టాక్ తో సహ మరో 58 యాప్‌లను నిషేధించింది. కేంద్రం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో టిక్‌టాక్ మంగళవారం స్పందించింది. ఇండియాలో టిక్ టాక్ ఉద్యోగుల భద్రతకు టిక్ టాక్ సీఈఓ కెవిన్ మేయర్ హామీ ఇఛ్చారు. తమ లక్ష్యానికి తాము కట్టుబడి ఉన్నామని, ఈ విషయంలో చాలావరకు కృతకృత్యులమయ్యామని అన్నారు.

భారతీయ చట్టాలకింద డేటా ప్రైవసీ, సెక్యూరిటీ వంటి అంశాలకు తామెంతో ప్రాధాన్యమిస్తున్నామని అన్నారు. ఈ మేరకు ఉండియాలోని టిక్ టాక్ సిబ్బందికి ఆయన ఓ సుదీర్ఘమైన లేఖ రాశారు.  చైనా లోని  బైట్ డాన్స్ చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ కూడా అయిన కెవిన్ మేయర్ ఇటీవలే ఈ బాధ్యతలను చేపట్టారు. తమ కంపెనీ వెబ్ సైట్ పై ఈ లేఖను పోస్ట్ చేస్తూ ఆయన.. 2018 నుంచి ఇండియాలో కోట్లాది యూజర్లు ఈ యాప్ ద్వారా  వినోదాన్ని పొందేందుకు, తమ అనుభవాలను షేర్ చేసుకునేందుకు, క్రియేటివిటీని పెంపొందించుకునేందుకు తాము కృషి చేస్తూ వచ్చామని ఆయన పేర్కొన్నారు. మా ఉద్యోగులే మాకు బలం.. మీ క్షేమాన్నే మేం కోరుతున్నాం అని కెవిన్ అన్నారు.

భారత్ లోని తమ సంస్థ ఉద్యోగుల భద్రతపై వారు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. డిజిటల్ ఇండియాలో మేం క్రియాశీలకమైన, చురుకైన పాత్ర పోషిస్తున్నాం అని తెలిపారు. తాజా పరిణామాలపై తమ భాగస్వాములతోను, వాటాదారులతోను చర్చిస్తున్నట్టు ఆయన తెలిపారు. ‘ఇండియాలోని మా సిబ్బందికి ఓ సందేశం’ అంటూ ఆయన ఈ లేఖ రాశారు.  
Tags:    

Similar News