అణు బాంబుల‌పై!.. మోదీ బాంబు వేశార‌బ్బా?

Update: 2019-04-22 17:35 GMT
ఎన్నిక‌ల్లో మాట‌ల నేత‌లు కోట‌లు దాటుతున్నాయి. తూటాల్లా పేలుతున్నాయి. అంతేనా.. తూటాల‌నే వ‌ల్లె వేస్తూ సాగుతున్న నేత‌ల నోట... ఆ తూటాలు ట‌పాసులేమీ కాదంటూ సంచ‌ల‌నాల‌కే సంచ‌ల‌నాలైన కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు.. ఏ చోటామోటా నేత నోట నుంచో వ‌స్తే ఫ‌ర‌వా లేదు గానీ.. దేశ ప్ర‌ధాని హోదాలో ఉన్న నేత నుంచి వ‌స్తేనే కాస్తంత ఆలోచించాలి. దేశంలో సంక్షేమాన్ని వ‌దిలి సర్జిక‌ల్ స్ట్రైక్స్ వంటి వాటినే త‌మ విజ‌యాలుగా చెబుతున్న మోదీ లాంటి నేత... దేశానికి అవ‌స‌ర‌మా? అంటూ వైరివ‌ర్గాలు చేస్తున్న కామెంట్ల‌కు ధీటుగానే బ‌దులివ్వాల‌నుకున్నారో - ఏమో తెలియ‌దు గానీ...సోమ‌వారం నాటి ప్ర‌చారంలో భాగంగా న‌రేంద్ర మోదీ నోట నుంచి బాంబుల్లాంటి వ్యాఖ్య‌లే వ‌చ్చాయి. భార‌త్ వ‌ద్ద ఉన్న అణ్వ‌స్త్రాలు దీపావ‌ళి వేడుక‌ల కోసం దాచుకునేవి కాదంటూ ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు.

రాజ‌స్థాన్ లోని బార్మ‌ర్ లో నిర్వ‌హించిన ఎన్నిక‌ల ర్యాలీలో ప్ర‌సంగించిన సంద‌ర్భంగా మోదీ ఈ వ్యాఖ్య‌లు చేశారు. పాకిస్థాన్ అణు బాంబులు ప్ర‌యోగిస్తే మ‌న ప‌రిస్థితి ఏమిటంటూ ఆందోళ‌న చెందే వారికి భ‌రోసా ఇచ్చేలానే ఈ వ్యాఖ్య‌ల‌ను చేసిన మోదీ... భార‌త్ వ‌ద్ద ఆ బాంబులు లేవా?  పాక్ మాత్ర‌మే ప్ర‌యోగిస్తుందా?  భార‌త్ వాటిని దీపావ‌ళి వేడుక‌ల కోసం దాచుకుంటుందా? అన్న కోణంలో ప‌దునైన వ్యాఖ్య‌ల‌ను సంధించిన మోదీ... పాక్ ను ఇప్ప‌టికే ఎంత‌గా భ‌య‌పెట్టాలో అంత‌గా భ‌య‌పెట్టామ‌ని వ్యాఖ్యానించారు. బాలాకోట్ స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్‌ ను మాటమాత్రంగా కూడా ప్ర‌స్తావించ‌కుండానే మోదీ చేసిన ఈ వ్యాఖ్య‌లు చేశారు. త‌మ ప్ర‌భుత్వం వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించిన తీరుతో పాక్ బొచ్చె ప‌ట్టుకుని ప్ర‌పంచ దేశాల చుట్టూ భిక్షాట‌న చేయ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి నెల‌కొంద‌ని కూడా ఆయ‌న త‌న‌దైన శైలి కామెంట్లు చేశారు.

అయినా ప్ర‌పంచ దేశాల్లో భార‌త్ ను ధీరోదాత్త‌త క‌లిగిన దేశంగా నిల‌బెడితే... కాంగ్రెస్ మాత్రం నిత్యం ధైర్యం గురించే మాట్లాడ‌తార‌ని త‌న‌పై ఆరోప‌ణ‌లు సంధిస్తోంద‌ని మోదీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. భార‌త ప్ర‌ధానిగా దేశాన్ని అత్యున్న‌త స్థాయిలో నిలిపే క్ర‌మంలో తాను వ్య‌వ‌హ‌రించ‌కుండా ఇంకేం చేయాలని ఆయ‌న ప్ర‌శ్నించారు. ధైర్యం గురించి మాట్లాడ‌కుండా భ‌జ‌న చేయాలా? అంటూ కూడా ఆయ‌న కాంగ్రెస్ పార్టీపై సెటైర్లు గుప్పించారు. మొత్తంగా పాక్ వ‌ద్దే కాకుండా భార‌త్ వ‌ద్ద కూడా అణ్వ‌స్త్రాలున్నాయ‌ని - శత్రుదేశం వాటిని ప్ర‌యోగిస్తే.. భార‌త్ అణ్వ‌స్త్రాల‌ను దీపావ‌ళి కోసం దాచుకుంటుందా? అంటూ త‌న‌దైన శైలి వ్యాఖ్య‌లు చేసిన మోదీ... బాంబుల్లాంటి మాట‌ల‌నే ప్ర‌యోగించార‌న్న కోణంలో విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.
Tags:    

Similar News