57 స్థానాల్లో 41 మంది ఏకగ్రీవం.. మిగిలిన 16 ఎక్కడంటే?

Update: 2022-06-04 11:30 GMT
పెద్దల సభగా పేర్కొనే రాజ్యసభకు ఈసారి మొత్తం 57 స్థానాల్లో ఖాళీలు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో 41 స్థానాలకు ఏకగ్రీవ ఎన్నిక పూర్తైన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన సంబరాలు భారీ ఎత్తున సాగుతున్నాయి.

ఏకగ్రీవంగా ఎన్నికైన వారి వివరాల్ని ప్రకటించినంతనే పెద్ద ఎత్తున అభినందనలు వ్యక్తమవుతున్నాయి. పలు పార్టీల నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైనా.. అందులో మెజార్టీ స్థానాలు బీజేపీ నుంచే కావటం గమనార్హం. రాజ్యసభకు 41 మందిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు.

యూపీ నుంచి 11 మంది తమిళనాడు నుంచి ఆరుగురు.. బిహార్ నుంచి ఐదుగురు.. ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు.. మధ్యప్రదేశ్.. ఒడిశాల నుంచి ముగ్గురు.. తెలంగాణ.. ఛత్తీస్ గడ్.. పంజాబ్.. జార్ఖండ్ నుంచి ఇద్దరు చొప్పున.. ఉత్తరాఖండ్ నుంచి ఒకరు చొప్పున ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

మొత్తం బీజేపీకి 14 మంది ఏకగ్రీవంగా ఎన్నికై మొత్తం ఏకగ్రీవాల్లో 30 శాతం ఆ పార్టీకి చెందిన వారే ఉండటం గమానార్హం. కాంగ్రెస్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు నాలుగేసి స్థానాల చొప్పు.. డీఎంకే.. బీజేడీ పార్టీలు మూడు చొప్పున.. ఆమ్ ఆద్మీ.. టీఆర్ఎస్.. అన్నాడీఎంకేలు రెండేసి చోట్ల.. జేఎంఎం.. జేడీయూ.. ఎస్పీ.. ఆర్ ఎల్ డీ ఒక్క సీటు చొప్పున సొంతం చేసుకున్నాయి.

స్వతంత్ర్య అభ్యర్తులుగా బరిలోకి దిగిన కపిల్ సిబల్ పోటీ లేకుండానే విజయం సాధించారు. చాలా కాలం తర్వాత తమిళనాడు నుంచి కాంగ్రెస్ తరఫున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తుంటే.. ఆ స్థానం చిదంబరంతో భర్తీ చేయనున్నారు. ఏకగ్రీవం కాని 16 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

ఏకగ్రీవం కాకుండా మిగిలిన 16 స్థానాల్లో మహారాష్ట్ర నుంచి ఆరు స్థానాలు.. రాజస్థాన్.. కర్ణాటకల నుంచి నాలుగేసి స్థానాలు చొప్పు.. పరియాణాలో రెండు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంగా పెద్దల సభలో క్రమక్రమంగా బలం పెంచుకుంటున్న బీజేపీకి.. తాజాగా తమ ఖాతాలోకి వచ్చిన సభ్యులతో మరింత బలంగా మారతారని చెప్పక తప్పదు.
Tags:    

Similar News