ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీకి అది ఇస్తాం.. ఇది ఇస్తాం అని భారీ భారీ హామీలిచ్చారు. దీనిపై ప్రస్తుత పార్లమెంటులో రగడ జరుగుతోంది కూడా. ఏపీ అసెంబ్లీలోనే కేంద్రం నుంచి దక్కాల్సిన సాయంపై తీర్మానం చేశారు. ఇక ఏపీలో కీలకమైన కొన్ని అంశాలకు కేంద్రం ఏమిచ్చిందన్నది చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. భారీ ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టకు కేంద్రం జాతీయ హోదా ఇచ్చింది కానీ... దానికి ఇచ్చిన నిధులు మాత్రం చాలా తక్కువ. గత ఏడాది ఓ 100 కోట్లు ఇవ్వగా మొన్నటి బడ్జెట్ లో మరో 100 కోట్లు ప్రకటించారు. అంత పెద్ద ప్రాజెక్టుకు 100 కోట్లు ఇచ్చిన కేంద్రం తన మంత్రుల విదేశీ పర్యటనలకు మాత్రం భారీగా ఖర్చు చేస్తోంది. సగటున ఏడాదికి 500 కోట్లు ఖర్చు చేస్తోందట. కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఈరోజు లోక్ సభకు వెల్లడించిన వివరాలు చూస్తే షాక్ తినాల్సిందే.
గత మూడేళ్లలో కేంద్రమంత్రులు విదేశీ పర్యటనలకు అయిన మొత్తం ఖర్చు రూ.1500 కోట్లు ఖర్చు అయ్యాయని ఆయన రాతపూర్వక సమాధానం ఇచ్చారు. అత్యధికంగా మినిస్టరీ ఆఫ్ పర్సనల్ ఖర్చు పెట్టిందని ఆయన పేర్కొన్నారు. ఈ శాఖ 2014-15లో రూ.351.65కోట్లు, 2013-14లో రూ.289.92కోట్లు, 2012-13లో రూ.453.95 కోట్లు ఖర్చుపెట్టినట్లు చెప్పారు. హోంమంత్రిత్వ శాఖ 2014-15లో రూ.30.24కోట్లు, 2013-14లో రూ.14.13కోట్లు ఖర్చు పెట్టిందని వివరించారు. ఈ మూడేళ్ల లెక్కల్లో 2014-15 సంవత్సరంలో ఎన్డీయే ప్రభుత్వమే అధికారంలో ఉంది. అంటే ఎన్డీయే మంత్రులు ఏడాదిలో 509 కోట్లు విదేశీ పర్యటనలకు ఖర్చు చేశారన్నమాట. పోలవరం వంటి ప్రాధాన్య ప్రాజెక్టులకు 100 కోట్లు... ఏపీకి ప్రత్యేక ప్యాకేజిగా 350 కోట్లు ఇచ్చినవి లెక్కేసినా కూడా మంత్రుల విదేశీ పర్యటనల మొత్తం అంతలేదు. అదీ సంగతి.