గత కొద్దిరోజులుగా ప్రపంచం మొత్తం చైనాలో వెలుగులోకి వచ్చిన వైరస్ దెబ్బకి భయంతో గజగజ వణికిపోతోంది. మన దేశంలో కూడా ఈ మహమ్మారి భాదితుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. దీనితో లాక్ డౌన్ ను చాలా కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇకపోతే , ఇప్పటివరకు దేశంలో కరోనా నిర్దారణ కోసం చేస్తే టెస్టుల సంఖ్య 20 లక్షలు దాటిపోయింది.
టెస్టుల జాబితాలో తమిళనాడు ముందుండగా, మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది. తమిళనాడులో 3 లక్షల టెస్టులతో అగ్రస్థానంలో ఉండగా.. మహారాష్ట్ర 2 లక్షల 50 వేల టెస్టులతో రెండో స్థానంలో ఉంది. ఇక ఏపీ 2.19 లక్షల టెస్టులతో ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది. అలాగే రాష్ట్రంలోని ప్రతి 10 లక్షల మంది జనాభాకు 3,768 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తూ దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా ఈ స్థాయిలో మరే రాష్ట్రం కూడా పరీక్షలు చేయడం లేదు.
కాగా, ఆ తరువాత స్థానాల్లో వరుసగా రాజస్థాన్ , ఉత్తర్ప్రదేశ్ , కర్నాటక గుజరాత్ , ఢిల్లీ ఉన్నాయి. పుణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) తయారు చేసిన ఐజీజీ ఎలీసా యాంటీబాడీ టెస్ట్కిట్కు ‘కొవిడ్ కవచ్ ఎలీసా’ అని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పేరు పెట్టింది. వ్యాలిడేట్ చేసి దానికి ఓకే చెప్పింది. 100% కచ్చితత్వం, 98.7% సెన్సిటివిటీతో ఈ టెస్ట్ కిట్ పని చేస్తోందని వ్యాలిడేషన్ లో తేలినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది. ఈ కొవిడ్ కవచ్ ఎలీసా గంటకి 90 టెస్టులు చేస్తుంది.