యావత్ ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం రూపొందిస్తున్న వ్యాక్సిన్ ఫలితం బయటకు వచ్చింది. ఇప్పటికి రెండు దశల్లో నిర్వహించిన హ్యుమన్ ట్రయల్స్ కు సంబంధించి ఫలితాలు ఎలా ఉన్నాయన్న విషయాన్ని ప్రఖ్యాత మెడికల్ జర్నల్ లాన్సెట్ తాజాగా వెల్లడించింది. వ్యాక్సిన్ సేఫ్ గా ఉందని.. దాన్ని ఇచ్చిన వారంతా క్షేమంగా ఉన్నట్లు లాన్సెట్ ఎడిటర్ రిచర్డ్ హోర్టన్ పేర్కొన్నారు.
‘‘వ్యాక్సిన్ సురక్షితం. బాగా పని చేస్తోంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. రోగనిరోధక శక్తిని పెంచుతోంది. ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. ప్రాథమికంగా ఆశాజనక ఫలితాలు వస్తున్నాయి. పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ లేవు. జ్వరం.. తలనొప్పి లాంటి లక్షణాలు కనిపించాయి’’ అని పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ తయారీలో 120 సంస్థలు ప్రయోగాలు చేస్తున్నారు. అయితే.. వీరందరిలోనూ ఆక్స్ ఫర్డ్ ఫలితాల మీదనే ప్రపంచం చూపు ఉంది. కీలక ఫలితాలకు కారణమవుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ అభిప్రాయాన్ని నిజం చేస్తూ.. తాజా ఫలితాలు వచ్చినట్లుగా చెప్పాలి. తాము డెవలప్ చేసిన ChAdOx1 nCoV-19 వ్యాక్సిన్ తో రోగనిరోధక శక్తి పెరిగినట్లుగా శాస్త్రవేత్తలు వెల్లడించారు.
వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్ల శరీరంలో యాంటీ బాడీలు.. తెల్ల రక్త కణాలు తయారైనట్లుగా గుర్తించారు. ఈ వ్యాక్సిన్ ను సమర్థవంతంగా ఎదుర్కోగలదని నిర్దారించే ముందు మరింత ముందుకు వెళ్లాల్సి ఉందని.. మరిన్ని ప్రయోగాలు నిర్వహించాల్సి ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చింపాంజీల్లో జలుబుకు కారణమయ్యే వైరస్ ను సేకరించి.. దానిలో జన్యుపరంగా మార్పులు చేసి ఆక్స్ ఫర్డ్ వర్సిటీ శాస్త్రవేత్తలు తాజా వ్యాక్సిన్ ను రూపొందించిన వైనం తెలిసిందే.
తాజాగా చేపట్టిన హ్యుమన్ ట్రయల్స్ లో మొత్తంగా 1077 మంది పాల్గొన్నారు. అందరిలోనూ యాంటీబాడీలు.. టి కణాలు విడుదలైనట్లు గుర్తించారు. అయితే.. కరోనాపై విజయం సాధించేందుకు ఈ స్థాయి సరిపోతుందా? అన్నది మరిన్ని ప్రయోగాలు చేస్తే కానీ తేలుతుందని చెబుతున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న పద్నాలుగు రోజులకు టి కణాలు.. 28 రోజులకు యాంటీబాడీలు తీవ్రదశకు చేరుకున్నాయి.
ప్రయోగం జరిపిన వారిలో తొంభై శాతం మందికి తొలి డోస్ కే యాంటీబాడీలు డెవలప్ అయినట్లుగా గుర్తించారు. కేవలం పది శాతం మందికి మాత్రమే రెండో డోస్ అవసరమైందన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 70 శాతం మందికి జ్వరం కానీ తలనొప్పి వచ్చింది. మరికొద్ది మందిలో తిమ్మిర్లు.. ఆలసట.. వికారం లాంటి లక్షణాలు కనిపించినట్లు గుర్తించారు. కాకుంటే.. అలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్న వారికి పారాసిటమాల్ ఇచ్చినంతనే తగ్గినట్లుగా గుర్తించారు.
వ్యాక్సిన్ ను మరింత ఎక్కువగా ఫలితాలు చూసేందుకు వీలుగా త్వరలో బ్రిటన్ లో పదివేల మందికి..అమెరికాలో 30 వేల మందికి.. దక్షిణాఫ్రికాలో 2వేల మంది.. బ్రెజిల్ లో 5వేల మందిపై ప్రయోగాలు చేయనున్నారు. ఈ ప్రయోగం పూర్తి అయి.. విజయవంతమైతే.. ఈ ఏడాది చివరకు వ్యాక్సిన్ ప్రపంచానికి అందుబాటులో వచ్చే వీలుంది. ఈ వ్యాక్సిన్ కు తొలుత 'ChAdOxI'గా వ్యవహరించినప్పటికీ తాజాగా మాత్రం AZD1222గా పేరు మార్చారు. ఈ వ్యాక్సిన్ ను బ్రిటన్ కు చెందిన ఆక్స్ ఫర్డ్ వర్సిటీతో పాటు బ్రిటిష్ స్వీడిష్ కంపెనీ అస్ట్రాజెనికాలు కలిసి అభివృద్ధి చేస్తున్నారు. అందుకే ఈ వ్యాక్సిన్ కు ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ గా పలువురు అభివర్ణిస్తున్నారు.