ఏపీలో ఆర్టీసీ బస్సులే ఆక్సిజన్ బెడ్లు

Update: 2021-05-27 17:30 GMT
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా లాక్ డౌన్ తో ఖాళీగా ఉన్న బస్సులను కరోనాతో అల్లాడుతున్న బాధితులను ఆదుకునేందుకు సిద్ధం చేసింది. ఏపీలో కరోనాతో అల్లాడుతున్న ఏజెన్సీ ప్రాంతాల ప్రజలకు ఊరటనిచ్చేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

వైద్యసౌకర్యాలు లేని ఏజెన్సీ ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సుల్లో ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేయడం ద్వారా కరోనా రోగులను ఆదుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు విజయవాడ నుంచి రవాణామంత్రి పేర్ని నాని ఈ ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేసిన వెన్నెల స్లీపర్ సర్వీస్ లను ప్రారంభించారు. ప్రతి బస్సులో 10 మంది రోగులకు చికిత్స అందించనున్నారు.

రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే గిరిజనుల కోసం ఆర్టీసీ వెన్నెల బస్సుల్లో ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా విశాఖ ఏజెన్సీలో కరోనా వైద్యం కోసం నాటు పడవల్లో వెళ్తూ గిరిజనులు మృత్యువాత పడిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఏపీలోని మారుమూల ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులనే తాత్కాలిక ఆస్పత్రులుగా మార్చి సేవలు అందించేందుకు ఏపీ ప్రభుత్వం ఈ సాహసోపేత నిర్ణయం తీసుకుంది
Tags:    

Similar News