కరోనా మహమ్మారి ప్రధాన దాడి ఊపిరి తిత్తులపైనే అన్న సంగతి తెలిసిందే. దీంతో.. కేవలం శ్వాస అందకనే ఎంతో మంది చనిపోతున్నారు. ఇప్పటి వరకు నమోదైన మృతుల్లో మెజారిటీ ఆక్సీజన్ అందకనే అన్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం కేసులు తగ్గుతున్నాయి కాబట్టి ఆక్సీజన్ వార్తలు తగ్గాయికానీ.. నెల రోజుల క్రితం వరకు పరిస్థితి ఎంతో దారుణంగా ఉంది.
అయితే.. ఇప్పటికీ కరోనా గండం పూర్తిగా తొలగిపోలేదు. కొత్తగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇలాంటి వారిలో చాలా మంది ఆక్సీజన్ కోసం ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో బాధితులకు ఆక్సీజన్ కాన్సన్ ట్రేటర్లు సరఫరా చేసేందుకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సిద్ధమైంది.
ఎవరికైనా ఆక్సీజన్ కాన్సన్ ట్రేటర్ అవసరమైతే.. ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ సమయంలో డాక్టర్ సర్టిపికెట్ జత చేయాలి. అలాంటి వారికి కాన్సన్ ట్రేటర్ అందిస్తారు. ఇందుకుగానూ వారానికి వెయ్యి రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తారు.
ఒకవేళ ఆ డబ్బులు కూడా చెల్లించలేని దీన స్థితిలో ఉంటే.. అలాంటి వారికి ఉచితంగానే అందించనున్నారు. అవసరమైన వారు రెడ్ క్రాస్ సొసైటీని సంప్రదిస్తే సరిపోతుంది. ఎలా అప్లికేషన్ అందజేయాలనే వివరాల కోసం 1800-425-1234 నంబర్ కు ఫోన్ చేయాలి.