ఆక్సిజన్ అందక కరోనా రోగుల ఆర్తనాదాలు ఆంధ్రప్రదేశ్ ను ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేశాయి. గడిచిన కొద్ది రోజులుగా ఏపీలో ఆక్సిజన్ కొరత నెలకొన్నప్పటికీ.. తీవ్ర రూపం దాల్చలేదు. అందుకు భిన్నంగా శనివారం ఒక్కరోజులో ఏపీ వ్యాప్తంగా ఆక్సిజన్ అందక కరోనా రోగులు మరణించిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది. పలు మీడియా సంస్థల రిపోర్టుల ప్రకారం రాష్ట్రంలోని రెండు ఆసుపత్రుల్లోనే 26 మంది ప్రాణాలు విడిచినట్లుగా చెబుతున్నారు. ప్రభుత్వంమాత్రం అందుకు భిన్నంగా.. ఆక్సిజన్ అందక ఎలాంటి మరణాలు చోటు చేసుకోలేదని స్పష్టం చేస్తోంది.
మీడియా రిపోర్టుల ప్రకారం అనంత ఆసుపత్రిలో కరోనా కారణంగా 20 మంది మరణిస్తే.. కర్నూలులో ఆరుగురు ఆక్సిజన్ అందక ప్రాణాలు పోయినట్లు చెబుతున్నారు. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లోనూ ఆక్సిజన్ కొరత ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఆసుపత్రిలో చేరిన తమ బంధువుల్ని రక్షించుకోవటానికి పడుతున్న పాట్లు అన్ని ఇన్ని కావు. ఏపీలోని పలు ఆసుపత్రులు ఆక్సిజన్ లేదని చేతులు ఎత్తేయటంతో ఇప్పుడు ఆక్సిజన్ సిలిండర్ల కోసం ఎవరికి వారు తమకు తోచిన విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
అనంతపురం జిల్లా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక బాధితుల ఊపిరి ఆగింది. వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్న వారి ప్రాణాలు పిట్టల్లా రాలినట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే ఆ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత కారణంగా 15 మంది మరణించారని చెబుతున్నారు.
శనివారం ఉదయం నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు 14 మంది మరణించినట్లుగా జిల్లా కలెక్టర్ చెప్పారు. అయితే.. ఈ మరణాలేమీ ఆక్సిజన్ కొరతతో వారి మరణాలు చోటు చేసుకోలేదని ఆయన స్పష్టం చేస్తున్నారు.
ప్రభుత్వం చెబుతున్న దానికి వాస్తవానికి మధ్య అంతరం ఎక్కువగా ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది. ప్రభుత్వం చెబుతున్నట్లుగా ఆక్సిజన్ కొరత లేని పక్షంలో.. సిలిండర్ల కోసం జనాలు పరుగులు తీయటం.. ఆసుపత్రి సిబ్బందిని బతిమిలాడటం లాంటివెన్ని ఎందుకు జరుగుతున్నాయన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఏమైనా ఆంధ్రాకి పట్టిన ఆక్సిజన్ కొరత వెంటనే తీరకపోతే.. అందుకు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.