ఎమ్మెల్యేగా తనకు దక్కాల్సిన గౌరవం విషయంలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ పిల్లి అనంతలక్ష్మి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏకంగా ప్రొటోకాల్ ఉల్లంఘనపై అసెంబ్లీలో ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు. కాకినాడలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పిల్లి అనంతలక్ష్మీ మాట్లాడారు. కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేటలో ఈనెల 12వ తేదీ నుంచి 15 వరకు బీచ్ ఫెస్టివల్ ను నిర్వహించామన్నారు. దీనిలో భాగంగా 14న 'నేను లోకల్' సినిమా ఆడియో ఫంక్షన్ నిర్వహించారని తెలిపారు. సినిమా మోజులో పడిన అధికారులు స్థానిక ఎమ్మెల్యే అయినప్పటికీ తమను లెక్కచేయలేదని అనంత లక్ష్మీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూర్చున్న చోట నుంచి వెనక్కినెట్టి ఎక్కడి నుంచో వచ్చిన వారికి తమ సీట్లు కేటాయించి అమర్యాదగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితులు మళ్లీ తలెత్తకుండా చర్యలు తీసుకునేలా అసెంబ్లీ సమావేశాల్లో ఫిర్యాదు చేస్తామని ఆమె స్పష్టం చేశారు.
కాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ మండిపడ్డారు. రాజధాని పరిధిలో ఇంకా దాదాపు 1400 ఎకరాల్లో భూ సమీకరణ చేపట్టాల్సి ఉందన్నారు. ఆ సమీకరణకు కూడా రైతుల నుంచి సహకారం ఉందన్నారు. ఒక పక్క మెజారిటీ రైతులు స్వచ్ఛందంగా భూములిస్తుంటే వైసీపీ నేత జగన్ రైతులతో మాట్లాడేందుకు ఎందుకు పర్యటనకు వస్తున్నారో అర్థం కావడం లేదని విమర్శించారు. అభివృద్ధి అడ్డుపడే జగన్ తన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని నారాయణ సూచించారు. రాజధానిలో ప్లాట్లు కేటాయించిన రైతులకు త్వరలోనే రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తామని నారాయణ వెల్లడించారు. ప్లాట్లకు సంబంధించి అభివృద్ధి పనులకు త్వరలోనే శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు. రాజధాని అవసరాల దృష్ట్యా ఇంకా భూమి అవసరం ఉందన్నారు. రాజధాని పరిధిలో పూలింగ్ ద్వారా రైతులు భూములిస్తామని ముందుకొస్తే, ఇప్పటికైనా ప్రభుత్వం తీసుకునేందుకు సిద్ధంగా ఉందని నారాయణ తెలిపారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/