ఏపీ మంత్రి నారాయణకు కోపం వచ్చేసింది. కూల్ గా కనిపించే ఆయన తాజాగా చిర్రుబుర్రులాడేస్తున్నారు. తనపై చేస్తున్న విమర్శల నేపథ్యంలో ఆయన మండిపడటమే కాదు.. ఓపెన్ ఛాలెంజ్ చేసేశారు. తాను విపరీతమైన అ్రక్రమాలకు పాల్పడుతున్నట్లుగా జగన్ మానసపుత్రిక అయిన సాక్షిలో కథనాలు పెద్ద ఎత్తున రాసేస్తున్నారని.. వాటిల్లో వాస్తవం లేదని తేల్చారు. తనపై ఏదో ఒకటి సృష్టించి బురద జల్లటం సాక్షికి ఒక అలవాటుగా మారిందన్న ఆయన.. తాను ఏ కాంట్రాక్టర్ ను కలవలేదని స్పష్టం చేశారు.
ఒకవేళ తాను కాంట్రాక్టర్లను కలిసినట్లు రుజువు చేస్తే మంత్రి పదవి నుంచి తప్పుకుంటానని.. లేదంటే.. సాక్షి పత్రికను మూసేస్తారా? అని ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. తన రాతలతో రైతుల మధ్య విభేదాలు సృష్టించొద్దన్న నారాయణ ఈ రేంజ్ లో చెలరేగిపోవటం ఆశ్చర్యకరంగా ఉందన్న మాట వినిపిస్తోంది. ఇంత తీవ్రస్వరంతో నారాయణ మండిపడటంపై స్పందన ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మంత్రి నారాయణ కాంట్రాక్టర్లను కలిసిన విషయానికి సంబంధించిన రాతలన్నీ చీకట్లో బాణాలా? లేక నిజంగా అన్నది తేలాల్సి ఉంది. మరి.. మంత్రి నారాయణ ఓపెన్ ఛాలెంజ్ మీద జగన్ బ్యాచ్ ఎలా స్పందిస్తుందోనన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఒకవేళ.. కాంట్రాక్టర్లను కలిసి విషయానికి సంబంధించిన ఆధారాలు బయటకొస్తే మాత్రం నారాయణకు చిక్కులు తప్పవని అంటున్నారు. మరి.. ఎలాంటి పరిణామం చోటు చేసుకుంటుందో చూడాలి.