ఆందోళనకరంగా 'రూపాయి'..

Update: 2018-09-10 07:21 GMT
భారత ఆర్థిక వ్యవస్థ రోజురోజుకు క్షీణించే ప్రమాదముందా..? అంటే తాజా పరిస్థితులను చూస్తే అవుననే తెలుస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థను నిర్ణయించే రూపాయి విలువ రోజురోజుకు పడిపోతుండడంతో ఆర్థిక సంక్షోభం రావచ్చనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. గతంలో రూపాయి విలువ రూ.60 నుంచి 65 మధ్యలో కొనసాగేది. కానీ గత కొన్ని రోజుల నుంచి పరిశీలిస్తే ఈ పరిస్థితి దారుణంగా తయారవుతోంది.

పలు అంతర్జాతీయ పరిస్థితులు - ట్రెడింగ్‌ వంటి కారణాలతో డాలర్‌ తో పోలిస్తే నెల కిందట రూపాయి విలువ రూ.70కి చేంది. అయితే ఆర్థిక సంస్కరణతు తదితర కారణాల వల్ల కిందటి వారంలో కోలుకుంటూ వచ్చింది. కానీ సోమవారం ఆరంభంలోనే రూపాయి విలువ క్షీణదశలో ఉంది. తాజాగా రూ.72.13 విలువతో ప్రమాదకరంలో ఉంది.

ఈ పరిస్థితి ఇలాగే సాగితే రానురాను 73 నుంచి 75కు పడిపోయే అవకాశం లేకపోలేదని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. దీంతో దిగుమతి రేట్లు అమాంతం పెరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా నష్టాల బాట పడుతున్న దేశీయ మార్కెట్లతో ఆందోళన నెలకొంది. రెండు రోజుల సెలవుల తరువాత ఒక్కసారిగా ఇంతగా పడిపోవడం చూసి ట్రేడ్‌ వ్యాపారులు షాక్‌కు గురయ్యారు.
Tags:    

Similar News