భారత్ లో ఉన్నత పౌరసత్కారాలుగా భావించే పద్మ అవార్డుల ప్రదానోత్సవం నేడు అట్టహాసంగా జరిగింది. పలు రంగాల్లో విశేష సేవలందించిన వారికి ప్రతి ఏడాది ఇచ్చే ప్రతిష్ఠాత్మక పౌర పురస్కారాలు 'పద్మ' అవార్డుల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్‌లో సోమవారం అట్టహాసంగా జరిగింది. 2020 సంవత్సరానికి ప్రకటించిన పద్మ పురస్కారాలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేడు ప్రదానం చేశారు. భారత స్టార్ షట్లర్, ఒలింపిక్ పతక విజేత పివి. సింధు పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కు ప్రకటించిన పద్మ విభూషణ్ అవార్డును, ఆమె కుమార్తె బన్సూరీ స్వరాజ్ అందుకున్నారు.
ప్రగతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్రమంత్రి అమిత్ షా తదితరులు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం 2020 ఏడాదికిగానూ ఈఏడాది జనవరిలో పద్మ అవార్డులను ప్రకటించగా, ఇవాళ పురస్కారాలను ప్రదానం చేశారు. ఈసారి 119 మందికి పద్మ అవార్డులు దక్కాయి. వీరిలో ఏడుగురికి పద్మ విభూషణ్, 10 మందికి పద్మభూషణ్, 102 మందిని పద్మశ్రీ అవార్డులు వరించాయి. తెలుగు సినీ గాయకుడు, గత ఏడాది సెప్టెంబర్ 25న కరోనాతో తుది శ్వాస విడిచిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు.
మరణానంతరం అరుణ్ జైట్లీకి పద్మ విభూషన్, సుష్మా స్వరాజ్ కు పద్వ భూషన్ ను ప్రకటించారు. తెలుగు తేజం, స్టార్ షట్లర్ పీవీ సింధుకు పద్మ భూషన్ అవార్డును రాష్ట్రపతి ప్రదానం చేశారు. బాలీవుడ్ నటికి కంగనా రనౌత్ పద్మశ్రీ పురస్కారం అందుకుంటోన్న సమయంలో దర్బార్ హాలులో చప్పట్లు మోగాయి. బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్, సింగర్ అద్నాన్ సమీ, నిర్మాత కరణ్ జోహర్ సైతం పద్మశ్రీ పురస్కారం పొందారు. అందుకున్నారు.
ఈసారి తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురు పద్మ పురస్కారాలకు ఎంపికయ్యారు. వీరిలో ముగ్గురు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారున్నారు. రామస్వామి అన్నవరపు (కళారంగం), ప్రకాశ్ రావు అసవడి (సాహిత్యం, విద్య), నిడుమోలు సుమతి (కళలు) ఏపీ నుంచి అవార్డులకు ఎంపికయ్యారు. తెలంగాణ నుంచి కనకరాజును కళారంగంలో పద్మశ్రీ వరించింది.
పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతలు:
1) షింజో అబే (జపాన్ మాజీ ప్రధాని)
2) ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, గాయకుడు, తమిళనాడు
3) బెల్లె మోనప్ప హెగ్డే, వైద్య రంగం, కర్ణాటక
4) నరీందర్ సింగ్ కపానీ, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, అమెరికా
5) మౌలానా వహిదుద్దీన్ ఖాన్, ఆధ్యాత్మికత, ఢిల్లీ
6) బీబీ లాల్, ఆర్కియాలజీ, ఢిల్లీ
7) సుదర్శన్ సాహూ, ఆర్ట్, ఒడిషా