కరోనాతో కన్నుమూసిన ఐఎంఏ మాజీ అధ్యక్షుడు .. ?

Update: 2021-05-18 06:30 GMT
కరోనావైరస్ సెకండ్ వేవ్ లో కరోనా మహమ్మారి భయంకరంగా వ్యాపిస్తోంది. ప్రతి రోజు కూడా లక్షల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. అలాగే వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. చిన్నా, పెద్ద, ధనిక,పేద అన్న తేడా లేకుండా అందరూ కూడా ఈ కరోనా మహమ్మారి భారిన పడి విలవిలలాడుతున్నారు. సామాన్యుల నుండి ప్రముఖుల వరకు ఎంతోమంది ఈ మహమ్మారి భారిన పడి కన్నుమూశారు. తాజాగా భారతీయ వైద్య సంఘం (ఐఎంఏ) మాజీ అధ్యక్షుడు డాక్టర్ కేకే అగర్వాల్ కరోనా తో పోరాడి పోరాడి చివరికి కరోనా చేతిలో ఓటమి పాలై కన్నుమూశారు.

వివరాల్లోకి వెళ్తే .. పద్మశ్రీ అవార్డు గ్రహీత ఐఎంఏ మాజీ అధ్యక్షుడు కెకె అగర్వాల్ సోమవారం అర్ధరాత్రి కరోనాతో కన్నుమూశాడు. కరోనా సోకిన అగర్వాల్ ఎయిమ్స్ ఆసుపత్రిో చికిత్స పొందుతున్నాడు. కరోనా సోకిన అగర్వాల్ ఎయిమ్స్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స అందించినా కూడా కోలుకోలేక మరణించారు. వైద్యుడిగా ప్రజలకు చికిత్స చేయడంతో పాటు వైద్య విషయంలో ప్రజలను చైతన్యవంతం చేయడంలో అగర్వాల్ కీలకంగా వ్యవహరించారు. వైద్య రంగంలో విశేష కృషి చేసిన అగర్వాల్ కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. సెకండ్ వేవ్ సమయంలో కూడ ప్రజలకు ఆరోగ్యం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వీడియోలు రికార్డు చేసి  ఆయన ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నం చేశారు. అగర్వాల్ గుండె వైద్య నిపుణులుగా సుదీర్ఘకాలం పనిచేశారు. హర్ట్‌ కేర్ పౌండేషన్ కు ఆయన అధ్యక్షుడిగా పనిచేశారు.  ఇక ,ఆయన 2005లో డాక్టర్ బీసీ రాయ్ అవార్డు, 2010లో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు.
Tags:    

Similar News