ఈనాడు సంస్థల అధినేత.. మీడియా మొఘల్ లాంటి మాటలతో చెప్పే రామోజీరావు మళ్లీ వార్తల్లోకి వచ్చేశారు. ఆయనకు ‘పద్మ’ పురస్కారం పక్కా అన్నది ఇప్పుడు లేటేస్ట్ గా వినిపిస్తున్న మాట. అనధికారికంగా దీనికి సంబంధించిన సమాచారం ఆయనకు వచ్చేసిందని చెబుతున్నారు. అధికారిక ప్రకటన వెలువడటమే ఆలస్యమన్న మాట వినిపిస్తోంది.
దశాబ్దాల తరబడి మీడియా రంగంలో తిరుగులేని విధంగా దూసుకెళ్లటంతో పాటు.. రామోజీ ఫిలింసిటీ లాంటి అద్భుతాన్ని ఆవిష్కరించిన ఆయన.. ప్రధాని మోడీ పిలుపునిచ్చిన స్వచ్ఛ భారత్ అంశంపై తాను చేసిన కృషిని ఈ మధ్యనే మోడీని కలిసి మరీ వివరించటం తెలిసిందే. రామోజీ గొప్పతనాన్ని.. కమిట్ మెంట్ ను ప్రధాని తన మన్ కీ బాత్ కార్యక్రమంలో పలుమార్లు ప్రస్తావించటం తెలిసిందే.
ఇంతకాలం పురస్కారాలకు దూరంగా ఉన్న ఆయనకు.. తాజాగా పద్మ పురస్కారం లభించటం ఆసక్తికరంగా మారింది. మరి.. రామోజీ పద్మ పురస్కారంలో భాగంగా ఏది ఇవ్వనున్నారన్నది ఆసక్తికరంగా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రామోజీకి పద్మవిభూషణ్ ఇస్తారని చెబుతున్నారు. అనధికారికంగా అందుతున్న సమాచారం ప్రకారం.. రామోజీకి పద్మ విభూషణ్ పక్కా అని ఆయన సన్నిహిత వర్గాలు లోగుట్టుగా చెప్పేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించిన రామోజీకి పద్మ పురస్కారం రైట్ టైంలో రైట్ పురస్కారంగా మారనుందన్న మాట వినిపిస్తోంది. అదెంత నిజమన్నది అధికారిక ప్రకటన తర్వాత వెలువడే రియాక్షన్ తేల్చనుంది.