పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవలి కాలంలో దూకుడు పెంచుతున్న సంగతి తెలిసిందే. పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యే నాటికి పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకుల్లో ఒకరగా ఉన్న ఉత్తమ్ అనంతరం తన గ్రాఫ్ పెంచుకునేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. అనూహ్య రీతిలో వచ్చిన ఉప ఎన్నికలతో కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యూహాలను సిద్ధం చేయడంలో ఆయన బిజీ బిజీగా గడిపేస్తున్నారు. పార్టలో మరెందరో నేతలు ఉన్నప్పటికీ...ఉత్తమ్ కీలకంగా వ్యవహరించడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే, ఉత్తమ్ గ్రాఫ్ ఈ రేంజ్ లో పెరిగేందుకు కారణం ఆయన సతీమణి పద్మావతిరెడ్డి అని వారిని సన్నిహిత వర్గాల వారి అభిప్రాయం.
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఢిల్లీ నేతలు ఈ ఎన్నికలను కీలకంగా భావిస్తున్న సమంయలో ఓ వైపు పార్టీ కార్యకక్రమాల్లో బిజీగా ఉన్న ఉత్తమ్ మరోవైపు తన ఇమేజ్ విషయంలో దృష్టి పెట్టలేరనే సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఉత్తమ్ సతీమణి పద్మావతి రెడ్డి ఈ బాధ్యతలను తనపై వేసుకున్నట్లు తెలుస్తోంది. పీసీసీ చీఫ్ హోదాలో పా్టీకి చెందిన సోషల్ మీడియా విభాగంతో సమన్వయం చేసుకుంటునే మరోవైపు పార్టీతో సంబంధం లేకుండా సొంత సోషల్ మీడియా టీమ్‌ని కూడా ఆమె సమన్వం చేస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటే, ఉత్తమ్ నే ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రొజెక్ట్ చేయడానికి అవసరమైన స్కెచ్ ని రూపొందించే పనిలో కూడా ఆమె ఇప్పటినుంచి బిజీగా ఉన్నారని కూడా చెప్తున్నారు. ఇందులో భాగంగానే ప్రత్యర్థల ప్రచారానికి కౌంటర్‌గా సోషల్ మీడియా టీమ్‌ని పనిచేయించడాన్ని ఇప్పటికే మొదలుపెట్టినట్లు సమాచారం.
మరోవైపు పార్టీ పరంగా ఒకింత ఒత్తిడి ఎదురైనా పద్మావతి రెడ్డి సమన్వయం చేస్తున్నట్లు సమాచారం. పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలు - టిక్కెట్లు - పొత్తుల చర్చలు ఇలా అనేక కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారు. అయితే ఎప్పటికప్పుడు ఢిల్లీకి రిపోర్ట్‌లు పంపడం వంటి పనుల్లోఆమె కెప్టెన్‌కు సహాయకారిగా ఉంటున్నట్లు సమాచారం. పద్మావతిరెడ్డికి రాబోయే ఎన్నికల్లో తన ఎమ్మెల్యే గిరీ పై ఇంకా స్పష్టత లేనప్పటికీ ఇంత సీరియస్‌గా పనిచేస్తున్నారని కొందరు అంటున్నారు. ఈసారి మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్ టిక్కెట్ దొరుకుతుందో లేదో అనే చర్చోపచర్చలు ఓ వైపు సాగుతుండగా...ఆ విషయాన్ని పక్కన పెట్టి భర్తకు అనుకూలంగా తెర వెనుక వ్యూహాల్ని రచించే పనిలో బిజీ ఉన్నారని చెప్తున్నారు. ఇదంతా కాంగ్రెస్ మూల సిద్ధాంతమైన పనిచేయడం తో పాటుగా ప్రచారం కూడా అదే స్థాయిలో చేసుకోవాలనే దాన్ని ఉత్తమ్ దంపతలు ప్రధానంగా పద్మావతి రెడ్డి గ్రహించడం వల్ల అని పేర్కొంటున్నారు.