పద్మావతి చిత్రంపై వివాదాలు చినికి చినికి గాలివానలా మారుతున్నాయి. ఈ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ వివాదాలు వెన్నాడుతున్నాయి. ఈ చిత్ర విడుదలపై రాజ్ పుత్ కర్ణిసేన మొదటి నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. గత నెలలో ఈ సినిమాకు వ్యతిరేకంగా గుజరాత్‌లోని రాజ్ పుత్ కర్ణిసేన ఆధ్వర్యంలో దాదాపు లక్ష మంది రాజ్‌పుత్ వర్గీయులు ఆందోళన చేపట్టారు. నిన్న రాజస్థాన్ లోని ఆకాశ్ థియేటర్ లో ఆ చిత్ర ట్రైలర్ ను ప్రదర్శించడం వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఆ ప్రదర్శనకు నిరసనగా కర్ణిసేన ఆధ్వర్యంలో రాజ్‌పుత్ వర్గీయులు ఆ థియేటర్‌పై దాడి చేసి కౌంటర్ అద్దాలను, కిటికీలను ధ్వంసం చేశారు. తాజాగా - ఈ చిత్రం విడుదలకు నిరసనగా రాజ్ పుత్ కర్ణి సేన డిసెంబర్ 1న భారత్ బంద్ కు పిలుపునిచ్చింది.
ముందు నుంచి చెబుతున్నట్లుగానే ఈ సినిమా విడుదలను ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోమని రాజ్ పుత్ కర్ణి సేన మరోసారి స్పష్టం చేసింది. తమ మాట కాదని ఆ సినిమాను విడుదల చేస్తే థియేటర్లపై దాడులు చేస్తామని హెచ్చరించింది. ఆ సినిమా విడుదలకు నిరసనగా రాజ్ పుత్ కర్ణి సేన నేత లోకేంద్ర సింగ్ కల్వి డిసెంబరు 1న భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. నేడు బెంగళూరులో రాజ్ పుత్ కర్ణి సేన సభ్యులు సినిమాకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. ఈ సినిమా విడుదలను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుని తీరుతామని బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ చెప్పారు. అయితే, కర్ణిసేన, బీజేపీ నేతల వైఖరిపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక సినిమా విడుదలకు నిరసనగా భారత్ బంద్ చేపట్టడమేమిటని పలువురు ఘాటుగా కామెంట్లు పెడుతున్నారు. ఈ సినిమాకు మత, రాజకీయ రంగు పులముతున్నారని ఫైర్ అవుతున్నారు. ఆ సినిమాను చూడకుండానే అడ్డుకుంటామనడం, థియేటర్లను ధ్వంసం చేస్తామని బెదిరించడం అప్రజాస్వామికమని కామెంట్లు చేస్తున్నారు. అటువంటి వారికి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకున్న బీజేపీ నేతలు మద్దతు పలకడం బాధాకరమని అభిప్రాయపడుతున్నారు. ఈ వివాదాలు, దాడుల నేపథ్యంలో డిసెంబరు 1 న పద్మావతి విడుదలపై తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది.