టెన్నిస్ పోటీల్లో భారతీయుడు ఎవరైనా క్వార్టర్ ఫైనల్ వరకూ వెళ్లారంటే అదో గొప్ప విషయంగా ఉండేది. కానీ.. కొద్దికాలంగా టెన్నిస్ లో భారత్ సత్తా చాటుతున్నారు. నలబైఏళ్ల వయసులో ఒక గ్రాండ్ స్లామ్ ను సొంతం చేసుకోవటం అంత తేలికైన విషయం కాదు. ఓవైపు దూసుకొస్తున్న కుర్రాళ్లు చిచ్చర పిడుగుల్లా చెలరేగిపోతున్నా.. తనలో జోరు తగ్గలేదని నిరూపించారు భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్.
వెటరన్ ఆటగాడిగా బరిలోకి దిగి.. టైటిల్ సొంతం చేసుకుంటూ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్న పేస్ ఒక్కడిగా కన్నా.. స్విస్ దిగ్గజం మార్టినా హింగిస్ తో కలిసి యూఎస్ ఓపెన్ లో మిక్సెడ్ డబుల్స్ ను సొంతం చేసుకున్నారు. 42 ఏళ్ల వయసులో లియాండర్ పేస్ టైటిల్ విన్నర్ గా అవతరించటం ఒకవిధంగా రికార్డే. వయసు దెబ్బతో ఎంతోమంది క్రీడాకారుల్ని చరిత్రలో కలిపేస్తే.. పేస్ మాత్రం అందుకు భిన్నంగా వయసు మీద పడుతున్న కొద్దీ చిరుతలా చెలరేగిపోవటం గమనార్హం.
ఒకే ఏడాదిలో మూడు గ్రాండ్ స్లామ్ లలో మిక్సెడ్ టైటిల్ ను గెలుచుకున్న అరుదైన రికార్డును లియాండర్ పేస్.. మార్టినా హింగిస్ జంట సాధించింది. ఈ ఏడాదిలో వారు తాజా యూఎస్ ఓపెన్.. అంతకు ముందు ఫ్రెంచ్ ఓపెన్.. వింబుల్డన్ లను సొంతం చేసుకున్నారు. దీంతో.. అప్పుడెప్పుడో 1969లో ఉన్న రికార్డును ఈ జంట తాజాగా మరోసారి నమోదు చేశారు.
అదేం చిత్రమో కానీ.. స్విట్జర్లాండ్ టెన్నిస్ క్రీడాకారిణి.. భారత్ ఆటగాళ్లతో జత కడితే చాలు.. టైటిల్ సొంతం కావాల్సిందే. మహిళల డబుల్స్ లో సానియా మీర్జాతో.. మిక్సెడ్ డబుల్స్ లో లియాండర్ పేస్ తో జతకట్టే ఈ భామ వరుసగా టైటిళ్లను గెలుచుకుంటోంది. భారత్ ఆటగాళ్లతో గ్రౌండ్ పంచుకుంటే టైటిళ్లు పాదాక్రాంతం కావాల్సిందే.
హింగిస్ లోని టెక్నిక్.. నైపుణ్యం.. లియాండర్ పేస్ లోని పోరాటతత్వం కలిసి.. గ్రాండ్ స్లామ్ టైటిల్ ను సొంతం చేసుకునేలా చేస్తున్నాయి. మొత్తానికి వీరిద్దరి టీం వర్క్ మరో టైటిల్ ను భారత్ పేర రాసేలా చేసింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇప్పటివరకూ పది టైటిల్స్ ను సాధించి మార్టినా నవ్రతిలోవా రికార్డుకు తాజా విజయం తర్వాత లియాండర్ పేస్ ఒక్క టైటిల్ దూరంలో ఉన్నారు. ఇప్పటివరూ పేస్ తొమ్మిది టైటిళ్లను గెలుచుకున్నారు.
యూఎస్ ఓపెన్ లో లియాండర్ పేస్ టైటిల్ సాధిస్తే.. మరో శుభవార్త యావత్ భారత్ ఆశగా ఎదురుచూస్తుంది. ఇదే యూఎస్ ఓపెన్ లో.. ఇదే మార్టినా హింగిస్ తో జత కట్టిన సానియా మీర్జా ఫైనల్ మ్యాచ్ ఈ రోజు జరగనుంది. మిక్సెడ్ డబుల్స్ లో పేస్ తో.. మహిళల డబుల్స్ లో సానియాతో హింగిస్ జత కడుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి 9.30 గంటలకు జరిగితే డబుల్స్ మ్యాచ్ లో సానియా.. మార్టినా హింగిస్ జంట టైటిల్ ను సొంతం చేసుకొని.. సంతోషంతో ముంచెత్తుతారని ఆశిద్దాం. టైటిల్ ఫేవరేట్ గా దిగిన ఈ జంట టైటిల్ గెలుచుకోవటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. మరి.. కాలం ఎలాంటి సమాధానం ఇస్తుందో చూద్దాం.