కోట్లు పలికే పెయింటింగ్ ఒకటి పోగొట్టుకున్న ఒక పారిశ్రామికవేత్త దాని కోసం చేసిన ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. చివరకు చెత్తకుప్పలో దొరికిన వైనం ఆసక్తికరంగా మారింది. రూ.2.5కోట్లు విలువ చేసే పెయింటింగ్ ను గుర్తించకపోవటమే కాదు.. దాన్ని చెత్తకుప్పకు చేర్చిన వైనం విస్మయానికి గురి చేయక మానదు. ఇంతకూ అంత ఖరీదైన పెయింటింగ్ ఎలా మిస్ అయ్యింది? దాని కోసం ఎంతలా వెతికారన్న విషయాల్లోకి వెళితే..
జర్మనీకి చెందిన ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త జర్మనీలోని డస్సెల్ డార్ఫ్ ఎయిర్ పోర్టు లో విలువైన పెయింటింగ్ ను మర్చిపోయి ఫ్లైట్ ఎక్కేశారు. ఫ్రెంచ్ సర్రీయలిస్టు టాంగే గీసిన ఈ పెయింటింగ్ విలువ అక్షరాల రూ.2.5కోట్లు (మన రూపాయిల్లో లెక్క కడితే) ఇజ్రాయిల్ లో విమానం దిగిన తర్వాత కానీ.. తాను మర్చిపోయిన పెయింటింగ్ గురించి గుర్తుకు వచ్చింది.దీంతో.. తాను పెయింటింగ్ ను మర్చిపోయిన విషయాన్ని స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎయిర్ పోర్టులో వెతికిన పోలీసులు.. అలాంటిదేమీ లభించలేదని చెప్పారు.
ఇదే సమయంలో బెల్జియంలోని తన మేనల్లుడ్ని.. ఎయిర్ పోర్టుకు పంపారు సదరు పారిశ్రామికవేత్త. పెయింటింగ్ కు సంబంధించిన కొన్ని వివరాల్ని అక్కడ పోలీసులకు అందజేశారు. దీంతో.. పోలీసులు ఈ ఖరీదైన పెయింటింగ్ కోసం వెతికారు. చివరకు ఒక ఇన్ స్పెక్టర్ కు ఒక చెత్త తొట్లో ఇది కనిపించింది.ఈ రీసైక్లింగ్ బిన్ నను ఎయిర్ పోర్టు క్లీనింగ్ కంపెనీ వాడుతోంది. ఎయిర్ పోర్టులో మర్చిపోయిన పెయింటింగ్ ను చెత్తగా భావించిన సిబ్బంది.. చెత్తకు చేర్చటంతో అది చేరినట్లుగా గుర్తించారు. కోట్లు పలికే పెయింటింగ్ చెత్తకుప్పలోకి చేరగా.. దాన్ని భద్రంగా సదరు పారిశ్రామికవేత్తకు అందజేయనున్నారు. మొత్తానికి ఈ ఉదంతం ఆసక్తికరంగా మారింది.