భార‌త మాజీ నేవీ అధికారికి పాక్ ఉరిశిక్ష‌

Update: 2017-04-10 14:19 GMT
భార‌త మాజీ నేవీ అధికారికి దాయాది పాక్ ఉరిశిక్ష‌ను విధించింది. గూఢ‌చ‌ర్యం నేరాన్ని మోపిన పాక్ మిలిట‌రీ కోర్టు తాజాగా భార‌త నేవీ అధికారి కుల‌భూష‌ణ్‌ యాద‌వ్ కు ఉరిని విధించింది. 2016 మార్చి 3న బ‌లూచిస్థాన్ లో జాద‌వ్ ను పాక్ ఆర్మీ అరెస్ట్ చేసింది. పాక్ కు వ్య‌తిరేకంగా ఆయ‌న గూఢ‌చ‌ర్యానికి పాల్ప‌డుతున్న‌ట్లుగా పేర్కొంది.

ఇందుకుసంబంధించిన ఆధారంగా ఒక వీడియోను విడుద‌ల చేసింది. అందులో.. కుల‌భూష‌న్ తాను ఇండియ‌న నేవీ ఆఫీస‌ర్ అని చెప్పిన‌ట్లుగా వీడియో ఉంది. అయితే.. ఆయ‌న ఒక‌ప్పుడు నేవీ అధికారేన‌ని.. కాకుంటే త‌ర్వాత ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన విష‌యాన్ని వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం భార‌త ప్ర‌భుత్వంతో అత‌నికి ఎలాంటి సంబంధాలు లేవ‌ని వెల్ల‌డించింది. ఇరాన్ నుంచి వ‌చ్చిన వెంట‌నే కుల‌భూష‌న్ ను అరెస్ట్ చేసిన పాక్‌.. తాజాగా ఆయ‌న‌కు ఉరిశిక్ష విధిస్తూ నిర్ణ‌యించింది.

త‌న ప్ర‌యోజ‌నాల్ని దెబ్బ తీసేలా కుల‌భూష‌ణ్ వ్య‌వ‌హ‌రించిన‌ట్లుగా పాక్ పేర్కొంది. ఉరి తీర్పుపై భార‌త్ తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసింది. నేరానికి సంబంధించిన ఆధారాలు లేకుండా ఎలా ఉరి తీస్తారంటూ భార‌త్ ప్ర‌శ్నిస్తోంది. ఈ వ్య‌వ‌హారంపై పాక్ తో సంప్ర‌దింపులు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. ఏమైనా.. స‌రైన ఆధారాలు లేకుండా ఉరిశిక్ష‌ను పాక్ కోర్టు తీర్పు ఇచ్చింద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News