జవాన్లపై ఉగ్రదాడిని అడిగితే ఇఫ్తార్ విందు గురించి చెప్పాడు

Update: 2016-06-26 10:11 GMT
ఏ దేశంలో ఉగ్రదాడి జరిగినా.. వెనుకా ముందు చూసుకోకుండా ఖండించాల్సిన బాధ్యత మనిషి అన్న వాడికి ఉంటుంది. కానీ.. అందుకు భిన్నంగా వ్యవహరించి తమ దరిద్రపు బుద్ధిని ప్రదర్శించుకున్నారు పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్. జమ్మూ కాశ్మీర్ లో సైనికుల వాహనం మీద ఉగ్రదాడి జరిగి 8 మంది సైనికులు అమరులైన ఉదంతంపై దేశ ప్రజలు తీవ్ర బాధలో ఉన్న సంగతి తెలిసిందే.

ఈ అంశంపై ప్రశ్నించినప్పుడు.. మర్యాద కోసమైనా దానిపై బాధను వ్యక్తం చేయాలన్న కనీస ఆలోచన లేని భారత్ లోని పాక్ హైకమిషనర్ వ్యవహరించిన తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. సైనికులపై జరిగిన ఉగ్రదాడిపై రియాక్ట్ కావాలన్న మీడియా మాటకు ఆయన చెప్పిన మాటేమిటో తెలుసా? విన్న వెంటనే ఒళ్లు మండటం ఖాయం.

ఇంతకీ ఆయనేం చెప్పారంటారా? చదవండి.. ‘‘ఇది రంజాన్ నెల. ఇఫ్తార్ పార్టీ మీద దృష్టి పెడదాం. జమ్మూ..కశ్మీర్ సమస్యపై భారత్.. పాక్ ల మధ్య వివాదం నడుస్తోంది. దీన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. చర్చించి పరిష్కారం కనుగుంటామని ఆశిస్తున్నాం. ఇండియా.. పాక్ సంబంధాల గురించి ఇదివరకే చెప్పా. మనం ఇఫ్తార్ విందును ఆనందంగా జరుపుకుందం. ఇఫ్తార్ విందు చేసుకొని మనం సంతోషిద్దాం’’ అని చెప్పుకొచ్చారు. సరిహద్దుల్లోని సైన్యం కానీ చేతులు ఎత్తేస్తే.. ఇఫ్తార్ విందులు సంతోషంగా చేసుకోవటం సాధ్యమయయేనా? అయినా.. ఉగ్రదాడి గురించి మాట్లాడితే.. సంబంధం లేని విషయాల గురించి మాట్లాడటం ఏమిటి..?
Tags:    

Similar News