కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ జేఎన్ యూ విద్యార్థి కన్నయ్య విషయాన్ని కెలికి.. దాన్నో జాతీయ సమస్యగా తెగ వర్రీ అయిపోయిన రాహుల్ గాంధీ.. కమ్యూనిస్ట్ నేతలు దేశం కంటే తమ రాజకీయాలే ముఖ్యమన్నట్లుగా వ్యవహరించారు. మోడీ సర్కారును ఇబ్బంది పెట్టటానికి దరిద్రపుగొట్టు రాజకీయాలు షురూ చేసిన వారికి తగ్గట్లే తాజాగా పాక్ మీడియా వంతపాడుతోంది.
కన్నయ్య తరఫున వకల్తా పుచ్చుకొని మాట్లాడిన కన్నయ్యపై పాక్ మీడియా విపరీతమైన ప్రేమను కురిపిస్తోంది. ఆకాశానికి ఎత్తేస్తూ పొగిడేస్తుంది. తాము ఎప్పటి నుంచో చేస్తున్న వాదనను కన్నయ్య తాజాగా వినిపించాడంటూ కీర్తిస్తోంది. ఉగ్రవాది అఫ్జల్ గురు వర్థంతిని ఢిల్లీ జేఎన్ యూలో నిర్వహించి దేశాన్ని ముక్కలు చేస్తామని చెప్పటంతో పాటు.. పాకిస్థాన్ జిందాబాద్ అంటూ జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ విద్యార్థి నాయకుడి పట్ల పాక్ మీడియా అంతులేని ఆసక్తి ప్రదర్శిస్తోంది.
భారతదేశ సైనికులు కాశ్మీర్ మహిళల్ని అత్యాచారాలు చేస్తుందన్న కన్నయ్య వ్యాఖ్యల్ని విపరీతంగా ఫోకస్ చేస్తున్న పాక్ మీడియా.. ఈ వ్యాఖ్యల్ని ప్రముఖంగా ప్రసారం చేయటం గమనార్హం. జమ్మూకాశ్మీర్ భారత్ అంతర్భాగం కాదంటూ దుర్మార్గపు వ్యాఖ్యలు చేస్తున్న జేఎన్ యూ ప్రొఫెసర్ నివేదిత వ్యాఖ్యల్ని సైతం పాక్ మీడియా ప్రముఖంగా ప్రసారం చేయటం గమనార్హం. ఈ నేపథ్యంలో కన్నయ్యను వెనకేసుకొచ్చిన రాహుల్ గాంధీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాహుల్ దేశాన్ని ఏం చేయాలని భావిస్తున్నారు. భారతదేశం సమైక్యంగా ఉండటం ఇష్టం లేదా? భారత్ ప్రతిష్ఠను దిగజార్చటమే కాదు.. శత్రుదేశమైన పాక్ చేసే వాదనకు వంతపాడుతున్న కన్నయ్యకు రాహుల్ మద్దతు ఇవ్వటం దేనికి నిదర్శనం..? దీనిపై రాహుల్ సమాదానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.