ఎన్ని పెళ్లిళ్లయినా చేసుకోవచ్చు.. ఇక్కడికెళ్లండి

Update: 2020-01-16 08:45 GMT
మన హీరో పవన్ కళ్యాణ్ ఇక్కడి పుట్టి విమర్శలు ఎదుర్కొంటున్నాడు కానీ.. అదే అక్కడ పుట్టింటునే మూడు పెళ్లిళ్లు చేసుకున్నందుకు అస్సలు తిట్టేవారు కాదు.. ఈ న్యూస్ ఆసాంతం చదివాక పవన్ కళ్యాణ్ అక్కడి వెళ్తే అస్సలు తప్పే అనరు మీరు.. ఎందుకంటే అక్కడ ఎన్ని పెళ్లిళ్లు చేసుకుంటే అన్ని ఫ్రీ మరీ..

మన దేశంలో రెండో పెళ్లి చేసుకోవాలంటే పెద్ద ప్రాసెస్.. మొదటి భార్యకు విడాకులు ఇవ్వాలి. చట్టబద్దంగా ముందుకెళ్లాలి. దీన్ని కోర్టుల్లో పంచాయితీల్లో మెప్పించుకోవాలి. ఇవన్నీ తెగాలంటే మన వయసు మూడు పదులు దాటిపోతోంది. అప్పటికీ చేసుకుందామంటే పిల్ల దొరక్క లేనిపోని కష్టాలు.. కాంప్రమైజ్ అయిపోయినా రెండో పెళ్లికి నానా కష్టాలు పడుతున్న పరిస్థితి ప్రస్తుత సమాజంలో చూస్తున్నాం.. మన చట్టాలు - న్యాయాలు అంత ఈజీగా తెగ్గొట్టోవిగా లేకపోవడంతో రెండో పెళ్లి చేసుకునేసరికి మన సగం జీవితం సంకనాకిపోద్దీ.. అప్పుడు చేసుకున్నా మొదటి పెళ్లిలా ఉరిమే ఉత్సాహం ఉండకపోవచ్చు.

అయితే పాకిస్తాన్ లో అలా కాదు.. ఎన్ని పెళ్లిళ్లు చేసుకుంటే అంత గొప్ప.. వాళ్ల మతం - చట్టాలు - నిబంధనలు అలా ఏడ్చి చచ్చాయి మరీ.. ఇండియాలో ఒక్క పెళ్లికే దిక్కులేదురా అయ్యా అంటే.. పాకిస్తాన్ లో ఎన్ని పెళ్లిళ్లు చేసుకుంటే అన్నీ ఫ్రీ అంటా..  పాకిస్తాన్ లో ఒకటి - రెండు ఏంటీ.. ఏకంగా మూడు - నాలుగు పెళ్లిళ్లైనా చేసుకోవచ్చు. పాకిస్తాన్ లో ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది.

తాజాగా ఇదే పాకిస్తాన్ లోని బవల్పూర్ లో కొత్తగా ఓ కల్యాణ మంటపం కట్టారు. అక్కడ రెండోపెళ్లి చేసుకునే వాళ్లకు ఆ కల్యాణ మండపంలో 50శాతం రాయితీ ఇస్తారు. మూడో పెళ్లికి 75శాతం రాయితీ - 4వ పెళ్లికి ఏకంగా కల్యాణ మండపం ఫ్రీగా ఇస్తారు. అయితే కళ్యాణ మండపాన్ని ఆ వ్యక్తి మాజీ భార్య లేదా భార్యలు బుక్ చేయాలి. ఈ వార్త వైరల్ కావడంతో రెండో పెళ్లి చేసుకునేవాంతా ఎగబడుతున్నారట.. ఇండియాలోనూ ఇలాంటి సంప్రదాయం రావాలని మన పురుష పుంగవులు డిమాండ్ చేస్తున్నారు.


Tags:    

Similar News