పాక్‌ లో వాలెంటైన్స్ డే పై నిషేధం

Update: 2017-02-14 05:19 GMT
యువత ఎంతో ఉత్సాహంగా జరుపుకునే వాలెంటైన్స్‌ డే (ప్రేమికుల రోజు)ను నిషేధిస్తూ పాకిస్థాన్‌ లోని ఇస్లామాబాద్ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ముస్లిం సంప్రదాయం ప్రకారం వాలెంటైన్స్‌ డేను జరుపుకోవడం నిషేధమని పేర్కొంటూ ఈ మేర‌కు ఆదేశాలు ఇచ్చింది. వాలెంటైన్స్‌డే వేడుకలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేయరాదని హెచ్చరించింది. కోర్టు ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని సమాచార మంత్రిత్వశాఖ - పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ(ఫెమ్రా) - ఇస్లామాబాద్ చీఫ్ కమిషనర్లను ఆదేశించింది.

వాలెంటైన్స్‌ డే వేడుకలను నిషేధించాలని అబ్దుల్ వాహీద్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం పాక్‌లో వాలెంటైన్స్‌ డే వేడుకలను నిషేధిస్తూ సోమవారం తీర్పును వెలువరించింది. ప్రతి ఏడాది పాక్‌ లో ప్రేమికుల రోజు వివాదాస్పదంగా మారుతోంది. వివిధ ప్రాంతాల్లోని యువత ఈ వేడుకలను జరుపుకునేందుకు సిద్ధమవ్వగా తాజాగా కోర్టు ఆదేశాలు వారికి శరాఘాతంగా మారాయి. వాలెంటైన్స్‌డే వేడుకలపై హైకోర్టు తొలిసారి నిషేధం విధించడం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News